Amigos Movie Review : అమిగోస్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్…!!
Amigos Movie Review : నందమూరి కళ్యాణ్ రామ్ అనగానే మనకు గుర్తొచ్చేది మూడే సినిమాలు. అవి అతనొక్కడే, పటాస్, బింబిసారా. ఈ మూడు సినిమాలు తన సినీ జీవితంలో పెద్ద హిట్. బింబిసారాతో ఇటీవల కళ్యాణ్ రామ్ సూపర్ డూపర్ హిట్ కొట్టి మంచి ఊపుమీదున్నాడు. ఆ ఊపుతోనే అమిగోస్ పేరుతో సరికొత్త కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇది డాపల్ గాంగార్ నేపథ్యంలో రూపొందింది. అంటే మూడు విభిన్నమైన పాత్రల్లో కళ్యాణ్ రామ్ నటించి మెప్పించాడన్నమాట.
ఈ సినిమా తాజాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకుడు. అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్, టీజర్స్, పోస్టర్లు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. అందులోనూ బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. మరి.. ప్రేక్షకుల అంచనాలను కళ్యాణ్ రామ్ అందుకున్నాడా అనేది తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
Amigos Movie Review : కథ
సినిమా కథ ఏంటంటే.. ముగ్గురు ఒకే పోలికతో ఉండే వాళ్ల కథ. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించాడు. ఒకటి సిద్ధార్థ్. ఇంకోటి మంజునాథ్, మరొకటి మైఖేల్. ఈ మూడు పాత్రల్లో నటించాడు. ఒక్కో పాత్ర ఒక్కో రకంగా ఉంటుంది. మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి కళ్యాణ్ రామ్ బాగా మెప్పించాడు. ఈ ముగ్గురు ఒకరే తల్లిదండ్రులకు పుట్టిన వారు కాదు. ఒకరి ఫ్యామిలీకి, మరొకరి ఫ్యామిలీకి అస్సలు సంబంధమే ఉండదు. ఈ ముగ్గురిలో మైఖేల్ అనే వ్యక్తి గ్యాంగ్ స్టర్. ఇతడి కోసం, ఇతడిని పట్టుకోవడం కోసం ఎన్ఐఏ తెగ గాలిస్తూ ఉంటుంది. తనలాగే మరో ఇద్దరు ఉన్నారని తెలుసుకున్న మైఖేల్..
అతడు దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ అమాయకులైన సిద్ధార్థ్, మంజునాథ్ లను వాడుకుంటూ ఉంటాడు. చివరకు.. తమలాగే మరో వ్యక్తి కూడా ఉన్నాడని వీళ్లు తెలుసుకుంటారు. ఆ తర్వాత ముగ్గురి పరిస్థితి ఏమైంది. చివరకు మైఖేల్ ను ఎన్ఐఏ వాళ్లు పట్టుకుంటారా? అనేది తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాలి. సినిమా పేరు : అమిగోస్, డైరెక్టర్ : రాజేంద్ర రెడ్డి, నటీనటులు : కళ్యాణ్ రామ్, అషికా రంగనాథ్, బ్రహ్మాజి, సప్తగిరి, నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవిశంకర్, మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్, సినిమాటోగ్రఫీ : సౌందర రాజన్, విడుదల తేదీ : 10 ఫిబ్రవరి 2023
సినిమా ఎలా ఉందంటే?
ఈ సినిమా నిజానికి.. డాపల్ గాంగర్ నేపథ్యంలో తెరకెక్కింది. అదే ఈ సినిమాకు కొత్త పాయింట్. అది తప్పితే ఈ సినిమాలో మరో కొత్త పాయింట్ లేదు. రెగ్యులర్ కమర్షియల్ పంథాలోనే వెళ్తుంది. ముగ్గురు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఒకే పోలికతో ఉన్న వ్యక్తుల జీవితమే ఈ సినిమా. మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులు అయితే ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే.. స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. సెకండ్ హాఫ్ కూడా రొటీన్ గా సాగిపోయింది. హీరోయిన్ గా అషికా రంగనాథ్ బాగానే అలరించింది. మిగితా నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే అలరించారు. మొత్తానికి ఇది ఒక రొటీన్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా మిగిలిపోయింది. ప్లస్ పాయింట్స్, కళ్యాణ్ రామ్ నటన, డాపల్ గాంగర్ కాన్సెప్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్, మైనస్ పాయింట్స్, స్క్రీన్ ప్లే, రొటీన్ కమర్షియల్ డ్రామా, సెకండ్ హాఫ్, దితెలుగున్యూస్ రేటింగ్ : 2.5/5