Bimbisara Movie : బింబిసారా సినిమా ఫ్లాప్ అయితే కళ్యాణ్ రామ్ సినిమాలు చేయడం ఆపేస్తాడా?

Authored By aruna | The Telugu News | Published on: August 1, 2022, 6:00 pm

Bimbisara Movie : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సినిమాకు భారీ ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలను నిర్వహించారు.. ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొనడం ద్వారా సినిమా కు భారీ హైప్ ఐతే వచ్చింది. అలాగే సినిమా యొక్క ట్రైలర్ చూసిన తర్వాత మేటర్ ఉన్న సినిమా అయి ఉంటుంది అంటూ నందమూరి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బింబిసార అనే వ్యక్తి గురించి జనాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.

ఆయన గురించి నందమూరి కళ్యాణ్ రామ్ అని చెప్పాడు.. ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉంది. హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ ప్రారంభించి రెండు దశాబ్దాలకు పైగా నే అవుతున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా ఇప్పటి వరకు ఆయన కమర్షియల్ గా హిట్‌ అయ్యింది పెద్దగా లేదు. ఆయన కెరియర్ మొత్తం కూడా ఫ్లాపులతో నే కొనసాగింది. బయట హీరో అయితే కచ్చితంగా ఈ పాటికి అందరూ మర్చిపోయే వారు. అలాంటి ఫ్లాప్‌ లు కళ్యాణ్రామ్ కి పడ్డాయి. అయినా కూడా నందమూరి కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకొని అందులో సినిమాల నిర్మిస్తూ వరుసగా నటిస్తూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే నందమూరి కళ్యాణ్ రామ్ కి ఏకంగా 50 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు గా సమాచారం అందుతోంది.

If Bimbisara Movie Flop will Kalyan Ram stop movies

If Bimbisara Movie Flop will Kalyan Ram stop movies

సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా నందమూరి కళ్యాణ్ రామ్ కి స్థాయికి అంతగా వసూలు రావు అనేది మరి కొందరి వాదన. ఇలాంటి పరిస్థితిలో సినిమాలు చేయడం అవసరమా, ఇంతగా నష్టాలు వచ్చే సినిమాలను చేయడం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. బింబిసార సినిమా ఫ్లాపయితే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తన సినీ కెరీర్ ని ముగించి నిర్మాతగా కొనసాగడం మంచిది అంటూ నందమూరి అభిమానులు స్వయంగా సలహా ఇస్తున్నారు. నందమూరి హీరోలు అంటే ఇతర హీరోల ఫ్యాన్స్ చులకన భావనతో చూసే విధంగా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలు ఉన్నాయి అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నందమూరి కళ్యాణ్రామ్ ఆలోచిస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

No bio available for this author.

  1. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  2. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  3. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  4. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  5. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  6. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  7. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp