Home » Entertainment » Nandamuri Ramakrishna Sensational Comments On Ntr
Entertainment

Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ పై నందమూరి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: June 25, 2023, 7:00 pm
Advertisement

Jr Ntr : “RRR”తో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించడం తెలిసిందే. దీంతో మనోడు ప్రస్తుతం సినిమా కెరియర్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తారక్ మాత్రం వరుస పెట్టి స్టార్ దర్శకులను లైన్ లో పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ ప్రచారంలోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే గత కొంతకాలంగా టీడీపీ పార్టీకి గాని రాజకీయాలకు సంబంధించి తనపై వస్తున్నా వార్తలకు ఎన్టీఆర్ అస్సలు స్పందించడం లేదు. దీంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమైనట్లు ప్రచారం గట్టిగా జరుగుతూ ఉంది.

Advertisement

ఇలాంటి తరుణంలో నందమూరి రామకృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్ ఓడిపోతాడని నందమూరి రామకృష్ణ కామెంట్లు చేశారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ మరియు ప్రచారం చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు మాత్రం.. సినిమాలతో బిజీగా ఉండటంతో తారక్ ప్రచారం చేసే అవకాశం అయితే లేకపోవచ్చని రామకృష్ణ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న “దేవర” షూటింగ్ నిమిత్తం తారక్ దుబాయ్ లో ఉన్నట్లు సమాచారం.

nandamuri ramakrishna comments on Jr ntr

Advertisement

తన కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో “దేవర” కచ్చితంగా హిట్ అవ్వాలని ఎన్టీఆర్ ప్రతి విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారట. నందమూరి రామకృష్ణ చివరి వరకు తారక్ టిడిపిలో ఉంటాడని తెలియజేయడంతో… కొన్ని సంవత్సరాలు క్రితం “బాద్ షా” చేస్తున్న సమయంలో కట్టె కాలే వరకు టిడిపిలో ఉంటానని తారక్ చేసిన కామెంట్లను మరోసారి నందమూరి అభిమానులు టిడిపి కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి