Home » Entertainment » Nikhil Siddharth Comments About Drgs
Entertainment

Nikhil Siddharth : డ్రగ్స్ తీసుకోమని బలవంతం చేశారు.. హీరో నిఖిల్ సంచలన కామెంట్స్ !!

Authored By
aruna
The Telugu News | Published on: June 25, 2023, 8:00 pm
Advertisement

Nikhil Siddharth : మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ కేస్ బయటపడింది. ఇందులో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడిన సినీ నిర్మాత కేపీ చౌదరి ఈ కేసులో ఇరుక్కున్నారు. ఈయన కబాలి తెలుగు వర్షన్ కు నిర్మాతగా వ్యవహరించారు. అయితే మొన్న డ్రగ్స్ క్యారీ చేస్తూ పోలీసులకు చిక్కాడు. దీంతో పోలీసులు అతని కారును, బ్యాగును, మొబైల్ ను హ్యాండోవర్ చేసుకొని రెండు రోజులు రిమైండ్ కి తరలించి విచారించారు. ఈ క్రమంలోనే అతని నుండి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది.

Advertisement

ఈ డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రిటీలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత, అషూ రెడ్డి ఇంకా ఎంతోమంది ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నట్లు పోలీసులు అనుమాన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి కేపీ చౌదరికి వందల కాల్స్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే కేపీ చౌదరికి అషూ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అని విచారిస్తున్నారు. ఇంకా కేపీ చౌదరి ఫోన్లో చాలామంది సెలబ్రిటీల ఫోటోలు ఉన్నాయి. వాళ్లతో ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్లు డ్రగ్స్ తీసుకున్నట్లేనా అని కేపీ చౌదరి మీడియాను ప్రశ్నించారు.

Nikhil Siddharth comments about drgs

Advertisement

దీనిపై ఇంకా పూర్తి విచారణ జరగలేదు. ఈ క్రమంలోనే తాజాగా డ్రగ్స్ కేసుపై హీరో నిఖిల్ సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శనివారం నాడు హైదరాబాద్లో పోలీసులు ఏర్పాటు చేసిన ‘పరివర్తన’ అనే కార్యక్రమంలో నిఖిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ నన్ను కూడా గతంలో డ్రగ్స్ తీసుకోవాలని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఎప్పుడు వాటి జోలికి పోలేదు. సినీ పరిశ్రమలో ఒకరు చేసిన తప్పు వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుంది. మీరు మాత్రం డ్రగ్స్ జోలికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకండి అంటూ చెప్పుకొచ్చారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి