pawan kalyan : పవన్ కళ్యాణ్‌ను పెళ్లి చేసుకుంటా.. నందినీ రాయ్ కామెంట్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: January 25, 2021, 5:46 pm

pawan kalyan : పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ జనాల్లోనే కాకుండా సెలెబ్రిటీల్లోనూ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. తొలిప్రేమ, బ్రది, ఖుషి, జల్సా వంటి సినిమాలతో అమ్మాయిలను కట్టిపడేశాడు. ఎంతో మంది హీరోయిన్లకు పవన్ కళ్యాణ్ అంటే క్రష్ ఉంటుంది. డేట్, మ్యారేజ్ అని ఆప్షన్స్ ఇస్తే ఎంతో మంది పవన్ కళ్యాణ్ పేరు చెబుతుంటారు.

Nandini Rai Wants To Marry Pawan kalyan

Nandini Rai Wants To Marry Pawan kalyan

తాజాగా ఇప్పుడు అలాంటి ఓ ఘటనే జరిగింది. సుమ నిర్వహించే క్యాష్ షోలో నందినీ రాయ్ గెస్ట్‌గా వచ్చింది. ఇందులో అర్చన, మన్నార్ చోప్రా, నందినీ రాయ్ వంటి వారంతా పాల్గొన్నారు. అయితే ఈ షోలో సుమ చేసే అల్లరి, ఇరుకున పెట్టే ప్రశ్నలు ఎలా వేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో నందినీ రాయ్‌ కొన్ని ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏకంగా తన మనసులో ఉన్న కోరికలను బయటపెట్టసినట్టుంది.

ఇందులో టాలీవుడ్ స్టార్స్ అందరినీ కూడా చూపించింది సుమ. ఇందులో ఏ హీరోను పెళ్లి చేసుకుంటావ్? ఏ హీరోతో డేట్‌కు వెళ్తావ్ అని అందరినీ అడిగింది. కానీ ఎవ్వరూ చెప్పేందుకు ముందుకు రాలేదు. నాకు పెళ్లయిందంటూ అర్చన తప్పించుకుంది. కానీ నందినీ రాయ్ మాత్రం తన మనసులోని మాట చెప్పింది. ఏ హీరోతో డేట్‌కు వెళ్తావ్ అని సుమ అడిగితే.. రామ్ చరణ్ అని వెంటనే నందినీ సమాధానం చెప్పింది. ఇక పెళ్లి అయితే ఏ హీరోను చేసుకుంటావ్ అని అడిగితే క్షణం ఆలస్యం చేయకుండా..పవన్ కళ్యాణ్‌ని చేసుకుంటాను అని చెప్పేసింది. దీంతో అక్కడున్న వారంతా ఓ వేసేసుకున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp