Jani Master : బుల్లితెరపై ముద్దులు, హగ్గులు ఎలా పెరిగిపోయాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ పద్దతులు మాత్రం ఢీ షోలో హద్దులు దాటుతున్నాయి. ఒకప్పుడు ఢీ షోకు ఉన్న స్థాయి ఇప్పుడు లేకుండా పోయింది. ఢీ షో అంటే ఎంతో సీరియస్‌గా ఉండేది. కేవలం డ్యాన్సులు మాత్రమే ఉండేవి. ఇప్పుడున్న వికృత చేష్టలేవీ అందులో ఉండేవి కావు. ఇప్పుడు అసలు అది డ్యాన్స్ షోనేనా? అనే అనుమానం వస్తుంటుంది. అంతలా ఆ షోను దిగజార్చుతున్నారు. కంటెస్టెంట్లు, జడ్జ్‌లు, హోస్ట్, టీం లీడర్లు అందరూ ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా ఉన్నారు. ఒకప్పుడు పూర్ణ, ప్రియమణి కలిసి రెచ్చిపోయే వారు.
కంటెస్టెంట్లకు హగ్గులు, ముద్దులు అనే పద్దతిని ప్రారంభించింది బహుశా ఈ ఇద్దరే అనుకుంటా. ఇక పూర్ణ అయితే మరీ కసి మీదున్నట్టుగా బుగ్గలు కొరికేది. ప్రియమణి హగ్గులతో నలిపేసేది. కంటెస్టెంట్లు, టీం లీడర్లు బాగా చేసినప్పుడు ఇలా రెచ్చిపోయే వారు. ఇక ఆ హగ్గులు,ముద్దులు తమకి కూడా కావాలని హైపర్ ఆది వంటి వారు రెచ్చిపోతుంటారు. మొత్తానికి పూర్ణ బయటకు వెళ్లింది. ఆ ముద్దుల దరిద్రం పోయిందని అంతా భావించారు. కానీ ఆమె స్థానంలో నందితా శ్వేత వచ్చింది. ఆమె కూడా పూర్ణను భర్తీ చేస్తోంది. పూర్ణ లేని లోటుని తీర్చుతున్నట్టుంది. స్టేజ్ మీదకు వెళ్లి ముద్దులు, హగ్గులు అంటూ రెచ్చిపోతోంది.
తాజాగా వదిలిన ఢీ ప్రోమోలో నందిత రెచ్చిపోయింది. హ్యాండి కాపెడ్, సింగిల్ లెగ్‌తో అదిరిపోయేలా ప్రసాద్ డ్యాన్స్ వేశాడు. దీంతో అందరూ ఇంప్రెస్ అయ్యారు. ఇక నందిత ఆగలేకపోయింది. స్టేజ్ మీదకు వచ్చింది. గట్టిగా చెంపకు ముద్దు పెట్టింది. అది జానీ మాస్టర్ తట్టుకోలేకపోయాడు. వెంటనే తన కుర్చీ మీద నుంచి లేచిపోయాడు. ఓ కర్చీప్‌ను భుజం మీద వేసుకుని అక్కడి నుంచి అసహనంతో వెళ్లిపోయేందుకు రెడీ అవుతాడు. ఏంటి ప్రొడక్షన్ హౌస్‌లో జాయిన్ అవుతున్నారా? అని జానీ మాస్టర్ మీద ఆది కౌంటర్ వేస్తాడు. దీంతో ప్రియమణి పడి పడి మరీ నవ్వేస్తుంటుంది. మొత్తానికి ఆది మాత్రం మామూలోడు కాదనిపించుకున్నాడు.
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.