Sudigali Sudheer : సుధీర్ మీద మనసు పడ్డ హీరోయిన్.. అందరి ముందే ఆ మాట అనేసిందిగా

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 20 January 2022, 8:00 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా సరే త్వరగా పాపులర్ అవ్వాలంటే సుధీర్‌తో ట్రాక్ వర్కవుట్ చేసుకుంటే చాలు ఇట్టే పాపులర్ అవుతారు. అలానే వర్షిణి, విష్ణుప్రియ వంటి వారు కెరీర్ ఆరంభంలోనే సుధీర్‌తో కలిసి యాంకరింగ్ చేశారు. అలా మొత్తానికి సుధీర్ పక్కన హోస్ట్ చేసినా, కలిసి షోను నడిపించినా పాపులర్ అవుతారు.

ఇక ఇప్పుడు నందితా శ్వేత బుల్లితెరపై సందడి చేసేందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. వెండితెరపై నందితా శ్వేత పని అయిపోయింది. చివరగా అక్షర అనే సినిమాతో వచ్చింది. ఏవో కొన్ని లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లను ట్రై చేసింది. కానీ వర్కవుట్ అవ్వలేదు. మొత్తానికి బుల్లితెరపైకి వచ్చింది. ఢీ షోలో జడ్జ్‌గా కూర్చుంది. కానీ అక్కడ ఆమెకు అంతగా సెట్ అవ్వడం లేదు.

Nanditha Swetha On Sudigali Sudheer In Sridevi Drama Company

Nanditha Swetha On Sudigali Sudheer In Sridevi Drama Company

Sudigali Sudheer : సుధీర్ నందితా శ్వేత ట్రాక్..

అందుకే ఇలా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ కనిపించింది. ఇక ఇందులో సుధీర్ మీద తన అభిప్రాయాన్ని చెప్పేసింది. ఒక వేళ ఢీ షోలో సుధీర్ అంటే ట్రాక్ కలిపేవాళ్లేనేమో. మొత్తానికి సుధీర్‌ను చూస్తుంటే.. తనకు ఏమనిపిస్తోందో చెప్పేసింది. ఎక్కడికి పోతావు చిన్నివాడా అంటూ తన సినిమా టైటిల్‌ను చెప్పేసింది. దీంతో సుధీర్ తెగ సిగ్గుపడిపోయాడు.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి