Nani : ఇండస్ట్రీని వైఎస్ జగన్ కాపాడాలంటున్న నాని.. పవన్ కల్యాణ్ కు థాంక్స్..!
nani : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి అందరికీ విదితమే. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటించిన ‘రిపబ్లిక్’ సినిమాను సపోర్ట్ చేసేందుకుగాను జనసేనాని పవన్ కల్యాణ్ ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీ సమస్యలు ప్రస్తావిస్తూనే ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారాయి.
ఏపీ ప్రభుత్వాన్ని, మంత్రులను టికెట్ల విషయంలో పవన్ విమర్శించారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ పెద్దలు, మోహన్ బాబు సినీ పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడాలని చెప్పారు. నేచురల్ స్టార్ నాని గురించి కూడా మాట్లాడారు. ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో విడుదల చేయడం పట్ల డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నానిని ట్రోల్ చేయడం గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే థియేటర్స్ ఓనర్ అందరూ నానిపైన పడి ఆయన సినిమాలను నిషేధించడం కాకుండా వైసీపీ నాయకులతో మాట్లాడాలని పవన్ సూచించారు.
విభేదాలు పక్కన పెట్టాలి.. nani
పవన్ కల్యాణ్ కామెంట్స్‌పైన నేచురల్ స్టార్ నాని తాజాగా స్పందించారు. పవన్ కల్యాణ్ గారికి, , ఏపీ సర్కారుకు మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నా వాటిని పక్కనపెట్టాలని, సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి పవన్ కల్యాణ్‌గారు బాధ్యతగా మాట్లాడారని నాని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీ సభ్యుడిగా తాను ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి గారిని, సంబంధిత శాఖ మంత్రులను చిత్ర పరిశ్రమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానని హీరో నాని పేర్కొన్నారు. ఇకపోతే ఇండస్ట్రీ సమస్యల గురించి మాట్లాడినందుకుగాను పవన్ కల్యాణ్ గారికి ట్విట్టర్ వేదికగా నేచురల్ స్టార్ నాని థాంక్స్ చెప్పారు. నాని ట్వీట్ పట్ల భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ నాని ట్వీట్‌ను సపోర్ట్ చేస్తూ నానిని మెచ్చుకుంటుండగా, వైసీపీ అభిమానులు నాని ట్వీట్ పట్ల విమర్శలు చేస్తున్నారు. నానిని దూషిస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.