
Nani : నాని టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. నాని – శివ నిర్వాణ కాంబినేషన్ లో ఇంతక ముందు నిన్నుకోరీ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నానికి జోడిగా ‘పెళ్లి చూపులు‘ ఫేమ్ రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు ఆ తర్వాత ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ సినిమా సూపర్ హిట్ అన్న టాక్ వచ్చింది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. కాగా ఈ మోషన్ టీజర్ తో టక్ జగదీష్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు భారీగానే యాక్షన్స్ సీన్స్ ఉండబోతున్నాయని అర్థమవుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమాలో నాని ని కొత్తగా చూపించబోతున్నాడట దర్శకుడు శివ నిర్వాణ. అయితే నాని కి యాక్షన్స్ సినిమాలు అంతగా సెట్ కావడం లేదన్న టాక్ ఉంది. నిన్నుకోరి, నేను లోకల్, మిడిల్ క్లాస్ అబ్బాయి లాంటి క్లీన్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ అయితే ఖచ్చితంగా సూపర్ హిట్ అని ఫిక్సై పోవచ్చు.
మధ్యలో కృష్ణార్జున యుద్దం .. వి.. లాంటి సినిమాలు చేస్తే హీరోగా నాని కి మంచి పేరొచ్చినప్పటికి బ్లాక్ బస్టర్స్ గా నిలవలేకపోయాయి. చూడాలి మరి టక్ జగదీష్ సినిమా నాని కి ఎలాంటి సక్సస్ ఇస్తుందో. ఇక దర్శకుడు శివ నిర్వాణ ఇప్పటికే నిన్నుకోరి, మజిలీ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇప్పుడు నాని తో టక్ జగదీష్ హ్యాట్రిక్ సినిమా. ఈ సినిమాతో దర్శకుడు శివ నిర్వాణ భారీ హిట్ కొట్టబోతున్నాడని చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక నాని ఈ సినిమా తర్వాత శ్యాం సింగ్ రాయ్ అన్న సినిమా, అంటే సుందరానికి అన్న సినిమాలతో రాబోతున్నాడు.
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం…
Perni Nani : గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు మళ్లీ నోటికి పనిచెపుతున్నారు. సీఎం…
This website uses cookies.