vaizag steel : వైజాగ్ స్ట్రీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిన్న వైకాపా నెం.2 ఎంపీ విజయ సాయి రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. నగరంలోని ముఖ్య ప్రాంతాలన్ని కవర్ అయ్యేలా విజయ సాయి రెడ్డి పాద యాత్ర చేస్తూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నట్లుగా పేర్కొన్నాడు. ప్రైవేటీకరణ నిర్ణయంను వెనక్కు తీసుకోవాల్సిందే అంటూ పాదయాత్ర సందర్బంగా విజయ సాయి రెడ్డి కేంద్రంను డిమాండ్ చేశాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓ రేంజ్ లో విజయ సాయి రెడ్డి ఏకి పడేశాడు. ఆయన విమర్శలు ఏకంగా మోడీకి కూడా తాకాయి. గల్లీలో ఇంతగా నోరు చేసుకుంటున్న విజయ సాయి రెడ్డి ఎందుకు ఢిల్లీలో నోరు విప్పడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఢిల్లీ వెళ్లినప్పుడు మోడీ మరియు అమిత్ షాలను పదే పదే కలవడంతో పాటు వారికి అనేక బిల్లుల విషయంలో రాజ్య సభలో సహకారం అందించిన విజయ సాయి రెడ్డి ఇప్పుడు మాత్రం వైజాగ్ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ గల్లీలో ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఢిల్లీలో వారిని నిలదీసే దమ్ము ధైర్యం లేని విజయ సాయి రెడ్డి ఇలా ప్రజలను మోసం చేసేందుకు అన్నట్లుగా పాద యాత్ర పేరుతో డ్రామాలు ఆడుతున్నాడు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. చిత్త శుద్ది ఉంటే వెంటనే రాజ్యసభ సభ్యత్వంకు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో పాటు తన పార్టీ ఎంపీలందరిని కూడా రాజీనామా చేయించి వైజాగ్ స్టీల్ కోసం పోరాడాలంటూ డిమాండ్ చేయడం జరిగింది.
విజయసాయి వైకాపా పరువు కాపాడటం కోసం విశాఖ పట్నంలో పాదయాత్రల డ్రామాలు మొదలు పెట్టాడని చిత్త శుద్ది లేని శివ పూజ అన్నట్లుగా విజయ సాయి రెడ్డి ఉద్యమం ఉంది అంటూ ఇతర పార్టీ నాయకులు కూడా అంటున్నారు. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ నాయకుల తీరు కూడా పలు అనుమానాలకు తావు ఇస్తుంది. ఇప్పటి వరకు సీరియస్ గా ప్రధానిని కాని అమిత్ షా ను కాని కలిసి అడిగిందే లేదు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అయ్యిందని ఇప్పుడు ఏం చేసినా కూడా ప్రయోజనం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. అందుకే పార్టీలు జనాల్లో ఉద్యమాలు చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు తప్ప ఢిల్లీ స్థాయిలో ఆందోళనలు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.