Home » Entertainment » Nani Wife Dance Video Viral
Entertainment

Nani : నాని భార్య డ్యాన్స్ ఈ రేంజ్‌లో చేస్తుందా.. వైర‌ల్ అవుతున్న వీడియో

Authored By
Sam C
The Telugu News | Published on: June 9, 2022, 9:00 pm
Advertisement

Nani : నేచుర‌ల్ స్టార్ నాని గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ న‌టుడు ప్ర‌తి సినిమాకి త‌నలోని టాలెంట్ పెంచుకుంటూ వెళుతున్నాడు.తాజాగా నాని న‌టించిన అంటే సుందరానికి సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా బుకింగ్స్ బాగానే ఉన్నా సింగిల్ స్క్రీన్ లలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవనే సంగతి తెలిసిందే. అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయమైన నాని అంటే సుందరానికి సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన భార్యకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Advertisement

తన ప్రేమకథలో ఎలాంటి ఇబ్బందులు లేవని అయితే తన భార్య తరపు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తనకు అంజనను ఇచ్చి పెళ్లి చేయాలంటే ఒకింత టెన్షన్ పడ్డారని నాని వెల్లడించారు.తన భార్యది సైంటిస్ట్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఫ్యామిలీ అని నాని చెప్పుకొచ్చారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన అంటే సుంద‌రానికి చిత్రం రేపు(జూన్‌ 10)న విడుదల కాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్‌. అందులో నాని,నజ్రియా స్టెప్పులు అదిరిపోయాయి. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

nani wife dance video viral

Advertisement

Nani : నాని వైఫ్ టాలెంట్ మాములుగా లేదుగా..

ఇదిలా ఉంటే.. ఈ పాటకు నజ్రియాతో కలిసి స్టెప్పులేసింది నాని భార్య అంజన. స్క్రీన్‌పై పాట ప్లే అవుతుంటే.. నజ్రీయా, అంజనా..తమకు నచ్చిన విధంగా స్టెప్పులేశారు. ఇక చివర్లో వీరితో నాని కూడా జత కట్టాడు. ఈ వీడియోని నజ్రీయా ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. నాని, అంజ‌నల‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం ఆనందంగా ఉంద‌ని రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నాని వైఫ్‌లో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అంటూ నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి