Home » Entertainment » Nataraj Master Bad Comedy In Biggboss Telugu Ott Telugu
Entertainment

Bigg Boss OTT Telugu : బిగ్‌ బాస్‌ ఓటీటీ.. మాస్టారు మరీ ఇంత బఫూన్ లా అవుతున్నారేంటండీ?

Authored By
Himanshi
The Telugu News | Published on: March 2, 2022, 12:00 pm
Advertisement

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్ 5 లో నటరాజ్ మాస్టర్ వ్యవహరించిన తీరు అందరికీ అసహ్యం కలిగించింది అనడంలో సందేహం లేదు. ఆయన ప్రతి ఒక్కరికి జంతువుల పేర్లు పెట్టడం తో పాటు తనకు తానుగానే ఏవేవో ఊహించుకొని అవతలి వాళ్లను వేధించడం మొదలు పెడతాడు. దాంతో అవతలి వాళ్ళ నుండి స్నేహం హస్తం వచ్చినా కూడా అతడు ఇష్టపడడు. ఆ కారణాల వల్లనే నట్రాజ్ మాస్టర్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నుండి చాలా త్వరగా ఎలిమినేట్ అయ్యాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆయన అదృష్టం బాగుందో లేదా మరేమో కానీ అనూహ్యంగా బిగ్‌ బాస్‌ ఓటీటీ ప్లాట్ ఫారం ద్వారా మరో అవకాశం వచ్చింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మాజీ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన నట్రాజ్ మాస్టర్ ఈసారి కూడా అదే తరహా ప్రవర్తన తో ప్రేక్షకులను మరియు ఇంటి సభ్యులను ఇబ్బంది పెడుతున్నాడు.

Advertisement

మీరంతా కలుపుకొని వచ్చారు అంటూ ఎలిమినేషన్ కి నామినేషన్ వేసిన వాళ్ల పై విరుచుకు పడ్డాడు. ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయినప్పుడు అతని ప్రవర్తన విభిన్నంగా ఉంటుందని మరో సారి నిరూపితం అయింది.ఇక తాజాగా ఒక టాస్క్ లో భాగంగా సరయు మీరు పెళ్లికి ముందు ఎంత మందితో.. అంటూ ప్రశ్న పూర్తి చేయకముందే 120 మంది తో పెళ్లికి ముందు అంటూ వెకిలి నవ్వు నవ్వాడు. ఇది మరీ ఓవర్ అంటూ ఇంటి సభ్యులు కూడా కామెంట్ చేశారు. ఒక వ్యక్తి 120 మందితో వ్యవహారం అంటే మామూలు విషయం కాదు. ఒక వేళ అది చెప్పినా కూడా నమ్మశక్యంగా లేదు.

Nataraj master bad comedy in Biggboss telugu ott Telugu

Advertisement

కనుక మాస్టారు అబద్దం చెప్పి వెర్రి వాడు అయ్యాడు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. వారందరూ మీకు ఓట్లు వేసినా కూడా మీరు ఈ వారం సేవ్ అవుతారు అంటూ కొందరు ఇంటి సభ్యులు మాస్టర్‌ కు కామెంట్ చేశారు. మొత్తానికి అతను హౌస్‌ లో ఒక బఫూన్ లా తయారవుతున్నాడు అంటూ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ అంటే ఒకప్పుడు మంచి గౌరవం ఉండేది కానీ ఇప్పుడు అతని మాటలు మరియు చేతల వల్ల ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. గత సీజన్లో పోయిన గౌరవాన్ని ఈ సీజన్లో దక్కించుకుంటాడు అని భావిస్తే ఇప్పుడు మరింతగా బఫూన్‌ అవుతున్నాడు అంటూ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి