prabhas radhe shyam movie all scenes are copy from super hit movies
Radhe shyam : దేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతోంది. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ఆయన నటించిన ఈ ప్యాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి పండుగ కానుకగా జనవరి 14న విడుదలకానుంది. అయితే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే నేడు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రిరిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది.
ఈ వేడుకకు సంబంధించిన ఒక్కో విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను టాలెంటెడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి హోస్ట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఓ హీరో చిత్రానికి మరో హీరో వ్యాఖ్యాతగా వ్యవహరించడం అరుదుగా జరుగుతుంది. అయితే అప్పట్లో జాతి రత్నాలు మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొనడం చూస్తే వీరిద్దరి మధ్య ఉన్న మంచి స్నేహమే.. నవీన్ ను మనం హోస్ట్ గా చూసేందుకు కారణం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి తో పాటు ఈ మూవీ అనంతరం ప్రభాస్ తో సినిమా చేయబోయే దర్శకులంతా హాజరు కానున్నారని సమాచారం.
naveen polishetti going host radhe shyam movie pre release event
ఇక ఇదే ఈవెంట్‌లో రాధేశ్యామ్ ట్రైలర్‌ను అన్ని భాషాల్లో విడుదల చేయనున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది.సినిమా ప్రకటించిన నాటి నుంచి మూవీ నుంచి వచ్చిన ఒక్కో అప్డేట్ భారీ అంచనాలు నెలకొల్పాయి. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్, లిరికల్ సాంగ్ వీడియోస్ అయితే యుట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాతలే పాట ట్రెండింగ్ లో కొనసాగుతుంది. రూ. 140 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వస్తోన్న ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.