Karthika Deepam 23 Dec Today Episode : దీపుగాడిని దాచి కొత్త డ్రామా స్టార్ట్ చేసిన మోనిత.. దీప కష్టపడటం చూసి తట్టుకోలేక కార్తీక్ షాకింగ్ నిర్ణయం

Advertisement

Karthika Deepam 23 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 డిసెంబర్ 2021, గురువారం 1230 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత, సౌందర్య మధ్య పెద్ద గొడవ అవుతుంది. మీరే నా బిడ్డను ఎత్తుకున్నారు అంటే నోర్మూయ్ మోనిత అంటుంది. పిచ్చి వాగుడు తగ్గించి బాబు కోసం వెతుక్కో. లేదు ఇలాగే ఇక్కడే ఉంటా.. నాటకాలు చేస్తా అన్నావనుకో. వేడి వేడి అట్లకాడతో నీ తల మీద పగులగొడుతా.. అనగానే భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. వారణాసి.. నీకు దీప గురించి ఏదైనా ఆచూకి తెలిస్తే వెంటనే చెప్పు అంటుంది. దీంతో సరే మేడమ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు వారణాసి. మరోవైపు కార్తీక్, పిల్లలు కలిసి మొక్కలు నాటుతుంటారు. నాన్నా ఇప్పుడు ఈ మొక్కలు నాటడం అవసరమా.. అంటారు పిల్లలు. ఇవి ఎప్పుడు పెరిగి పెద్దవుతాయి.. కాయలు ఇస్తాయి అంటారు పిల్లలు. దీంతో తప్పు అమ్మా.. అలా మాట్లాడకూడదు.. అని అంటాడు కార్తీక్.

Advertisement

karthika deepam 23 december 2021 full episode

ఎప్పుడో ఎవరో పెట్టిన మొక్కల పండ్లను ఇప్పుడు మనం తింటున్నాం కదా. మొక్కలు నాటడం మంచి పని. మనం ఇప్పుడు నాటితే రేపు వాటి పండ్లను వేరే వాళ్లు తింటారు అని చెబుతాడు కార్తీక్. దీంతో అందరూ కలిసి మొక్కలు నాటుతుంటారు. ఇంతలో దీప వస్తుంది. ఓ మొక్కలు నాటుతున్నారా.. మంచి పని. నేను కూడా నాటుతాను అని చెబుతుంది దీప. శ్రీవల్లి కూడా అక్కడే ఉంటుంది. దీపను చూసి.. తన ఒంటి మీద ఉన్న బంగారం లేదని గమనిస్తుంది శ్రీవల్లి. నీ ఒంటి మీద బంగారం ఏమైంది అక్క.. అని అడుగుతుంది శ్రీవల్లి. కార్తీక్, పిల్లలు షాక్ అవుతారు. ఇంతలో బాబు లేచేసరికి శ్రీవల్లి ఇంట్లోకి వెళ్తుంది. పిల్లలు కూడా వెళ్తారు. బంగారం అమ్మేశావా.. అంటాడు కార్తీక్. తప్పని పరిస్థితుల్లో తాకట్టు పెట్టాను కార్తీక్ బాబు అంటుంది దీప. నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు అంటాడు కార్తీక్.

Advertisement

నేను ఒక పనికిమాలిన వాడిని దీప. కూర్చొని తింటున్నాను. నేను పనిచేస్తా అంటే వద్దు అంటావు.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి వరండా మీద కూర్చుంటాడు కార్తీక్. దీంతో దీప అక్కడికి వెళ్లి కూర్చొని.. కార్తీక్ చేతులను చూసి.. ఒక్కోసారి మంచి పనులు చేసినా.. చేతులకు మట్టి అంటుకుంటుంది. చేతులు మురికి అవుతాయి కార్తీక్ బాబు. దీంతో మీ తప్పేమీ లేదు కదా అని చెప్పి తన చేతులకు అంటుకున్న మట్టిని కడుగుతుంది దీప.

నేను చేసిన తప్పులను నువ్వు సరిదిద్దుతున్నావా దీప అంటాడు కార్తీక్. మరోవైపు తన కొడుకును ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కాక సతమతమవుతుంది మోనిత. అరె.. తల్లి కోడి అయినా తన పిల్లల దగ్గరికి వస్తే ఊరుకోదు. తన పిల్లలను కాపాడుకుంటుంది. మరి నేను ఏంటి.. నా బిడ్డ కనిపించకపోతే.. నేను వెతకడం లేదా.. నాకు బాధ వేయడం లేదా.. అని అనుకుంటుంది మోనిత.

Karthika Deepam 23 Dec Today Episode : దీప తాకట్టు పెట్టిన నగలను రుద్రాణికి అమ్మేసిన సేటు

కార్తీక్ మీద నాకు ఎంత ప్రేమ ఉంది.. ఆనంద రావు గాడి మీద కూడా నాకు అంతే ప్రేమ ఉందని నేను నిరూపించుకుంటాను. ఈ తల్లి ప్రేమ ఏంటో చెబుతాను.. అని అనుకుంటుంది. మరోవైపు దీప అమ్మిన బంగారాన్ని తీసుకొచ్చి సేటు.. రుద్రాణికి ఇస్తాడు.

వాటిని చూస్తుంది. మీరు చెప్పినట్టే ఆమె వస్తే డబ్బులు ఇవ్వనన్నాను అక్కజీ. మీకు ఫోన్ చేశాక డబ్బులు ఇచ్చాను అంటాడు. నగలు నాకు ఇచ్చేశావు కదా. నగల కోసం దీప వస్తే నువ్వు నగలు లేవు నాకు అమ్మేశానని చెప్పు.. సరేనా అంటుంది రుద్రాణి. సరే అక్కజీ అని చెప్పి సేటును వెళ్లిపోమంటుంది.

మరోవైపు రాత్రి పడుకున్నాక.. రుద్రాణి మనల్ని ప్రశాంతంగా బతకనిచ్చేలా లేదు అని అనుకుంటుంది దీప. దీంతో ఏం చేయాలో అర్థం కాదు దీపకు. మరోవైపు నిద్రపట్టడం లేదు ఏవైనా కథలు చెప్పమ్మా అని ఇద్దరు పిల్లలు అడుగుతాడు. ఇంతలో శ్రీవల్లి కొడుకు ఏడుస్తూ ఉంటాడు.

అమ్మ నీకో విషయం తెలుసా.. తమ్ముడు నాన్న ఎత్తుకుంటే ఏడుపు ఆపేస్తున్నాడు. ఇంకెవరు ఎత్తుకున్నా ఏడుపు ఆపడం లేదు అంటుంది శౌర్య. దీంతో దీప నవ్వుతుంది. మరోవైపు దీపూ గాడు కనిపించడం లేదని శ్రావ్య.. సౌందర్యతో చెబుతుంది.

కంగారు పడుతుంది. దీంతో ఇద్దరూ దీపూ గాడి కోసం వెతుకుతుంటారు. కానీ.. దీపూ ఎక్కడా కనిపించడు. ఏం చేయాలో అర్థం కాదు వీళ్లకు. మొత్తం వెతికాను అత్తయ్య ఎక్కడా లేడు అంటుంది. ఇంతలో మోనిత కిందికి దిగుతుంది. ఒకవేళ తనే దీపు గాడిని దాచి ఉంటుంది అని అనుకొని దీపు గాడిని ఎక్కడ దాచావో చెప్పు అని అడుగుతుంది శ్రావ్య.

దీంతో ఏయ్.. ఇది నీ పనే అని తెలుసు. దీపును ఎక్కడ దాచావో చెప్పు.. అని సీరియస్ గా అడుగుతుంది సౌందర్య. ఇది కొత్త నాటకమా.. అంటుంది. పదండి.. నేను కూడా మీతో పాటే వెతుకుతాను.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేద్దాం పదండి అంటుంది. దీంతో శ్రావ్య వెళ్లి మోనిత కాళ్లు పట్టుకుంటుంది. మోనిత ప్లీజ్.. దయచేసి నా కొడుకును నాకు ఇవ్వు అంటుంది.

శ్రావ్యను చూస్తుంటే నాకు బాధేస్తుంది. ఇప్పుడు అర్థం           అయిందా శ్రావ్య.. కొడుకును దూరం చేసుకున్న తల్లి బాధ ఎలా ఉంటుందో అని చెప్పి వెళ్లి దీపు గాడిని నా బెడ్ రూమ్ లో బెడ్ కింద దాచిపెట్టాను అంటుంది మోనిత. మరోవైపు డబ్బులు ఎలా సంపాదించాలో అర్థం కాదు కార్తీక్ కు. అప్పు అంతా ఎలా తీర్చాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

 

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

18 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

1 hour ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

2 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

3 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

12 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

13 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

14 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

15 hours ago

This website uses cookies.