Naveen Polishetty : అలా చెప్పడంతో సుమ షాక్.. నవీన్ పొలిశెట్టి మామూలోడు కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naveen Polishetty : అలా చెప్పడంతో సుమ షాక్.. నవీన్ పొలిశెట్టి మామూలోడు కాదు

Naveen Polishetty : బుల్లితెరపై యాంకర్ సుమకు పంచ్ వేయడం అంటే మామూలు విషయం కాదు. ఎవ్వరైనా సరే.. ముందు ఎవ్వరు ఉన్నా సరే సుమ కౌంటర్ వేస్తే నోరు మెదపలేరు. అందుకే ఆమె ఒంటి చేత్తో పెద్ద పెద్ద ఈవెంట్‌లన అవలీలగా నడుపుతుంది. ఫ్యాన్స్ చేసే గోలను కూడా తన సెటైర్లతో సైలెంట్ అయ్యేలా చేస్తుంటుంది. అలాంటి సుమను ఒకే ఒక్క మాటతో షాక్ అయ్యేలా చేశాడు నవీన్ పొలిశెట్టి. తాజాగా జాతి రత్నాలు యూనిట్ […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :21 February 2021,7:50 pm

Naveen Polishetty : బుల్లితెరపై యాంకర్ సుమకు పంచ్ వేయడం అంటే మామూలు విషయం కాదు. ఎవ్వరైనా సరే.. ముందు ఎవ్వరు ఉన్నా సరే సుమ కౌంటర్ వేస్తే నోరు మెదపలేరు. అందుకే ఆమె ఒంటి చేత్తో పెద్ద పెద్ద ఈవెంట్‌లన అవలీలగా నడుపుతుంది. ఫ్యాన్స్ చేసే గోలను కూడా తన సెటైర్లతో సైలెంట్ అయ్యేలా చేస్తుంటుంది. అలాంటి సుమను ఒకే ఒక్క మాటతో షాక్ అయ్యేలా చేశాడు నవీన్ పొలిశెట్టి. తాజాగా జాతి రత్నాలు యూనిట్ సుమ క్యాష్ షోలో వచ్చింది.

Anchor Suma Shock On Naveen Polishetty Comment

Anchor Suma Shock On Naveen Polishetty Comment

జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా, నిర్మాత ప్రియాంక దత్, దర్శకుడు అనుదీప్, హీరో నవీన్ పొలిశెట్టి వచ్చారు. ఇక ఈ టీంతో సుమ సందడి చేసింది. అందరూ కలిసి నవీన్ పొలిశెట్టిని బాగానే ఆడేసుకున్నారు. సుమ ఏదో ప్రశ్న అడిగితే.. నాకు గడ్డం ఉన్న అబ్బాయిలు అంటే ఇష్టమని హీరోయిన్ సమాధానం చెప్పడం.. ఆ విషయం ముందే చెబితే ఉంచేవాడిని కదా అని తన క్లీన్ షేవ్‌ను చూపించేశాడు నవీన్ పొలిశెట్టి.

Naveen Polishetty : అలా చెప్పడంతో సుమ షాక్..

ఈ మధ్య నీకు పాజిటివ్ లాంటిది ఏమీ రాలేదు కదా? అని నవీన్ పొలిశెట్టిని సుమ అడిగేసింది. పొద్దున్నే అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. హా పొద్దున్నే అని సుమ ఆరా తీయగా.. పొద్దున్నే కరోనా వచ్చిందని చెబుతున్నాడంటూ డైరెక్టర్ కౌంటర్ వేశాడు. అలా అనడంతో సుమతో పాటు అందరూ పగలబడి నవ్వేశారు. మొత్తానికి జాతిరత్నాలు టీం ఇలా తమ సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది