Hyper Aadi : నేను ఎక్కడికైనా వెళ్తాను నీకేంటయ్యా.. హైపర్ ఆదిపై నవ్యస్వామి ఫైర్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 25 March 2022, 4:30 pm

Hyper Aadi : హైపర్ ఆది వేసే పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఎదుటివారి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. అసహనానికి గురి చేసేలా ఉంటుంది.అయితే ఢీ షోలో ఆది మరింతగా రెచ్చిపోతోంటాడు. అందరినీ ఆటాడేసుకుంటాడు. మరీ ముఖ్యంగా అఖిల్‌ను కౌంటర్లతో దాడి చేస్తుంటాడు. ఆదికి తోడు ప్రదీప్ కూడా జాయిన్ అయ్యాడు. ఈ ఇద్దరూ కలిసి అఖిల్ పరువుతీసేస్తుంటారు.

అయితే తాజాగా వదిలిన ప్రోమోలో ఆది మరింతగా రెచ్చిపోయాడు. అఖిల్ మీద కత్తి పెట్టి గారడి చేసే వాడిలా మార్చేశాడు. అడుక్కునే వాడిలా చేసేశాడు. అలా పలుమార్లు అఖిల్‌ను కించపరిచేలా కామెంట్లు చేశాడు. అనంతరం మరో మారు పంచులతో కించపరిచాడు. త్వరగా కానివ్వండయ్యా అవతల మాకు చాలా పనులున్నాయ్.. బ్యాండ్ మేళం రెడీగా ఉందంటూ అఖిల్‌ను చూపించాడు.

Navya Swami Fires on Hyper Aadi In Dhee Latest Promo

Navya Swami Fires on Hyper Aadi In Dhee Latest Promo

Hyper Aadi : ఆది పంచులకు హర్టైన నవ్యస్వామి..

ఇక అంతటితో ఆగకుండా.. నవ్యస్వామిని గెలికాడు. ఆమె ఏమో కుంఫు నేర్చుకోవడానికి జపాన్‌కు వెళ్లాలి అని కౌంటర్ వేస్తాడు. నేను ఎక్కడికైనా వెళ్తాను నీకేంటయ్యా.. జపాన్‌కు వెళ్తాను, చైనాకు వెళ్తాను అని నవ్యస్వామి ఫైర్ అవుతుంది. నాకు తెలుసు నువ్ వెళ్తావ్ అని కరోనా వైరస్‌ను చైనా నుంచి తెచ్చింది కూడా నువ్వే అని అంటూ మరో కౌంటర్ వేస్తాడు. కానీ ప్రోమోలో అంతే కట్ చేసేశారు. మొత్తానికి ఆది పంచులకు నవ్యస్వామి హర్ట్ అయినట్టు కనిపిస్తోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి