Navya Swamy : ఎప్పుడూ అదే పని.. నవ్యస్వామి పరువుపాయే

Authored By Sam C | The Telugu News | Published on: March 3, 2022, 11:00 am

Navya Swamy : బుల్లితెర‌పై న‌వ్య స్వామికి ఉన్న క్రేజ్ వేరే లెవ‌ల్. ఆమె కథ సీరియల్‌తో రవి కృష్ణ, నవ్యస్వామి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆ సీరియల్‌తో నవ్య స్వామి ఫేట్ మారిపోయింది. రవికృష్ణ, నవ్యస్వామి జోడిపై లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. సీరియల్‌లో కెమిస్ట్రీ కుదరడం, ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ ఇద్దరూ రొమాన్స్ చేయడంతో అందరూ ఫిదా అయ్యారు.ఈ జంట సీరియ‌ల్ లోనే కాదు, రియ‌ల్ లైఫ్‌లోను తెగ సంద‌డి చేస్తుంటారు. ఓసారి ఏకంగా అందరి ముందే నవ్యస్వామికి రవి కృష్ణ ముద్దు పెట్టేశాడు. అలా అప్పటి నుంచి ఈ జంట మీద రూమర్లు రావడం ప్రారంభించాయి.

ఇక ఈ ఇద్దరికీ ఆమె కథ సెట్‌లోనే కరోనా కూడా సోకింది. ఆ సమయంలో ఈ ఇద్దరూ కూడా చాలా కష్టాలను అనుభవించారు.కన్నడ బ్యూటీగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టి తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది న‌వ్య స్వామి. నా పేరు మీనాక్షి అనే సీరియల్‌తో తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్‌ను పెంచుకున్న నవ్య కన్నడ, తమిళంలో పలు సీరియల్స్‌లో నటించింది. ఇక తరచూ తన ఫొటోలు షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ. గతంలో నవ్య స్వామి అవిష్‌ గౌడ్‌ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. అతడితో విడిపోయాక ఇప్పుడు రవి కృష్ణతో ప్రేమయాణం సాగిస్తుందని టాక్.

navya swamy always busy with phone

navya swamy always busy with phone

Navya Swamy : నవ్య ర‌చ్చ మాములుగా లేదు..

డాక్టర్ కావాలని యాక్టర్ అయ్యానని చాలా సార్లు చెప్పుకొచ్చింది నవ్య స్వామి. ఏదో అవకాశం వస్తే కన్నడ సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్టయింది నవ్య. ఆమె నటించిన ‘తంగళి’ సీరియల్ ప్రేక్షాదరణ పొందింది. ఆ తర్వాత ‘వాణీ రాణీ’, ఆహ్వానం వంటి సీరియల్స్ లో చేసింది.సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యంలో ఫోన్‌లో మునిగిపోయింది. ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కాగా, ఎప్పుడు ఫోన్‌లోనే ఉంటావా అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ఢీ 14లో సంద‌డి చేస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp