Navya Swamy : జీవితంలో అది దొరికినందుకు థాంక్స్.. వెకేషన్‌లో నవ్యస్వామి సందడి

Authored By aruna | The Telugu News | Published on: September 11, 2022, 5:00 pm

Navya Swamy : నవ్యస్వామి బుల్లితెరపై మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి సీరియల్స్ చేస్తూ వస్తోంది. నా పేరు మీనాక్షి, ఆహ్వానం వంటి సీరియల్స్‌తో ఫుల్ ఫేమస్ అయింది. అయితే ఆమె కథ సీరియల్ మాత్రం కెరీర్‌ను టర్న్ చేసింది. రవికృష్ణ నవ్యస్వామి జంటగా వచ్చిన ఈ సీరియల్ అద్భుతంగా సాగింది. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీతో రవికృష్ణ నవ్యస్వామి నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారారు. ఈ ఇద్దరి జోడి మీద వచ్చినన్ని రూమర్లు మరేతర జంట మీద వచ్చి ఉండవు. ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని ఇలా రకరకాల కథనాలు వచ్చాయి.

అయితే వీటిపై నవ్యస్వామి స్పందించి.. సున్నితంగా ఖండించేస్తుంది. తామిద్దరం మంచి స్నేహితులమేనని, పెళ్లి వార్తలన్నీ రూమర్లేనని క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా ఈ రూమర్లు మాత్రం వస్తూనే ఉంటాయి. వీరిద్దరూ ఇతర షోలు, ఈవెంట్లలో చేసే సందడి మామూలుగా ఉండదు. హగ్గులతో రెచ్చిపోతోంటారు. ఢీ షోలో ఈ ఇద్దరూ చేసిన హంగామా మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈ ఇద్దరూ ఆ షోలో కనిపించడం లేదు. బిగ్ బాస్ ఇంట్లోకి కూడా నవ్యస్వామి వెళ్తుందనే రూమర్లు కూడా వచ్చాయి.

Navya Swamy in netherlands vacation

Navya Swamy in netherlands vacation

కానీ ఇప్పుడు నవ్యస్వామి మాత్రం వెకేషన్స్‌లో ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. గత నెలలో హరితేజతో కలిసి ఫారిన్ కంట్రీస్‌లో నవ్యస్యామి సందడి చేస్తోంది. తాజాగా ట్రైన్‌లో కూర్చుని అద్దంలోంచి చూస్తూ.. రోజ్ కలర్డ్ గ్లాస్‌లోంచి ఇలా చూసే చాన్స్ ఇచ్చిన ఈ జీవితానికి థాంక్స్ అంటూ నవ్యస్వామి ఎమోషనల్ పోస్ట్ వేసింది. దీనిపై రవికృష్ణ స్పందిస్తూ.. మూడు రెడ్ హార్ట్ సింబల్స్ వేశాడు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp