Home » Entertainment » Navya Swamy Serial Completed Soon
Entertainment

Navya swamy : ఇక న‌వ్వ‌స్వామిని చూడ‌లేమంట‌.. ఆందోళ‌న‌లో అభిమానులు..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 19, 2022, 2:40 pm
Advertisement

Navya swamy : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు న‌వ్య‌స్వామి. ఆమె కథ సీరియల్‌తో రవి కృష్ణ, నవ్యస్వామి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆ సీరియల్‌తో నవ్య స్వామి ఫేట్ మారిపోయింది. కామెడీ షోలో అయినా, ఇతర స్పెషల్ ఈవెంట్లోనైనా కూడా ఈ జంట చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఓసారి ఏకంగా అందరి ముందే నవ్యస్వామికి రవి కృష్ణ ముద్దు పెట్టేశాడు. అలా అప్పటి నుంచి ఈ జంట మీద రూమర్లు రావడం ప్రారంభించాయి. ఇక ఈ ఇద్దరికీ ఆమె కథ సెట్‌లోనే కరోనా కూడా సోకింది. ఆ సమయంలో ఈ ఇద్దరూ కూడా చాలా కష్టాలను అనుభవించారు.

Advertisement

కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన చెందిన నవ్య.. ‘తంగాలీ’ అనే కన్నడ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ముఖ్యంగా ‘ఈటీవీ’లో ప్రసారమవుతున్న ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ ద్వారా నవ్య మంచి పేరు సంపాదించుకుంది. ఈ సీరియ‌ల్ మొద‌లు అయ్యి ఏళ్లు గ‌డుస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. రేప‌టితో ఈ సీరియ‌ల్‌కి శుభం కార్డ్ ప‌డ‌నున్న నేప‌థ్యంలో ఆమె త‌న ఇన్‌స్టాగ్రాములో ‘‘నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ‘మీనాక్షి’ రేపటితో ముగుస్తుంది. ఈ సీరియల్ స్టోరీకి శుభం కార్డు పడుతుందేమో.. కానీ, మీనాక్షి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని పేర్కొంది.

navya swamy serial completed soon

Advertisement

Navya swamy : న‌వ్య అభిమానుల‌కి షాక్..!

న‌వ్య స్వామి న‌టించిన ‘ఆమె కథ’, ‘కంటే కూతురినే కనాలి’ సీరియల్స్ కూడా ముగిశాయి. ఇప్పుడు తాజాగా నా పేరు మీనాక్షి కూడా పూర్తి కాబోతుంది. మ‌రి కొద్ది రోజులపాటు న‌వ్య‌స్వామి బుల్లితెర‌పై క‌నిపించ‌ద‌ని అభిమానులు దిగులు ప‌డుతున్నారు. ఆమె త్వ‌రలో ప్ర‌సారం కానున్న బిగ్ బాస్ ఓటీటీలో ప్ర‌త్యక్షంలో కానుంద‌నే ప్ర‌చారం జోరుగా న‌డుస్తుంది. మ‌రోవైపు ర‌వికృష్ణ‌ని వివాహం చేసుకోనుంద‌ని కూడా అంటున్నారు. చూడాలి ఈ వార్త‌ల‌పై ఏమైన న‌వ్య స్పందిస్తుందా..!

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి