Nayanthara : కొత్త ప్రాజెక్ట్‌తో వస్తున్న దర్శకనిర్మాతలకు షాకులిస్తున్న నయనతార..?
Nayanthara : పెళ్లి తర్వాత నయనతార పూర్తిగా మారిపోయిందా, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో మేకర్స్‌కు గట్టిగా కండీషన్స్ పెడుతుందా..ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 9వ తేదీన సౌత్ స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న నయనతార తమిళ దర్శకనిర్మాత అయిన విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, నయన్ పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం కాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. కానీ, ఈ వార్తల్లో నిజం లేదట.
ఇప్పటికే నయన్ కమిటైనవే అరడజనుకు పైగా ఉన్నాయట.తెలుగులో కొత్త ప్రాజెక్ట్ ఏదీ కమిటవకపోయినా కూడా మెగాస్టాఎ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసేసింది. ఇంకా సెట్స్ మీద పలు తమిళ ప్రాజెక్ట్స్‌తో పాటు హిందీలో నటిస్తున్న ఫస్ట్ మూవీ జవాన్ షూటింగ్ దశలో ఉంది. ఇందులో హీరో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, నయన్ సినిమాలను ఇకపై చాలా సెలెక్టెడ్‌గా ఎంచుకోవాలనుకుంటుందట.

Nayanthara Bad newss the directors coming up with new project
Nayanthara : నయన్ కెరీర్‌లో ఇంకా చాలా మార్పులు వస్తాయా..?
అందుకే, కొత్త సినిమాల కోసం దర్శకనిర్మాతలు నయన్‌ను సంప్రదిస్తే ఆమె పెడుతున్న కండీషన్స్ కాస్త షాకింగ్‌గా ఉన్నాయట. కొత్త సినిమాకు సైన్ చేయాలంటే హీరోలతో రొమాంటిక్ సీన్స్, బెడ్‌రూమ్మ్ సీన్స్ ఉండకూడదని నిర్మొహమాటంగా చెబుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఇంతకాలం తను సినిమా ప్రమోషన్స్ అంటే అసలు పట్టించుకునేది కాదు. అయితే, తన కండీషన్స్‌కు మేకర్స్ గనక ఒప్పుకుంటే ఇకపై నటించే సినిమా ప్రమోషన్స్‌కు హాజరవుతానంటూ కొత్తగా ఆఫర్ ఇస్తుందట నయనతార. ఏదేమైనా నయన్ కెరీర్‌లో ఇంకా చాలా మార్పులు వస్తాయని మాత్రం అర్థమవుతోంది.