Mana Shankara Vara Prasad Garu Movie Review : మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mana Shankara Vara Prasad Garu Movie Review : మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 January 2026,10:20 pm

ప్రధానాంశాలు:

  •  Mana Shankara Vara Prasad Garu Movie Review : మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Mana Shankara Vara Prasad Garu Movie Review : మెగాస్టార్ చిరంజీవి–దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘ మన శంకర వరప్రసాద్ గారు ’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి పూర్తిగా వింటేజ్ మోడ్‌లో కనిపిస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ Venkatesh కీలక పాత్రలో నటించడం మరో హైలైట్. ఇక చిరంజీవి Chiranjeevi సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార Nayanthara  హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ జోడీపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్ సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు, ఇప్పుడు మూడోసారి స్క్రీన్‌ను షేర్ చేయడం విశేషం.

Mana Shankara Vara Prasad Garu Movie Review మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌

Mana Shankara Vara Prasad Garu Movie Review : మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Mana Shankara Vara Prasad Garu Movie Review : బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్..

దర్శకుడు అనిల్ రావిపూడి Anil Ravipudi వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. గతేడాది వెంకటేశ్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన, ఈసారి చిరంజీవితో చేయడం వల్ల అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, సినిమా అధికారిక విడుదలకు ముందు జనవరి 11 రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇప్పటికే దుబాయిలో ప్రీమియర్ షో పూర్తవ్వగా, అక్కడి నుంచి తొలి టాక్ బయటకు వచ్చింది. దుబాయి Dubai ప్రీమియర్ రిపోర్ట్స్ ప్రకారం… సినిమా ట్రైలర్‌లో Movie Trailer చూపించినట్టుగానే ఇది పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్టు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో చిరంజీవి వింటేజ్ స్టైల్‌లో కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారట. ముఖ్యంగా నయనతారతో వచ్చే సీన్స్, అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్ ప్రేక్షకులను నవ్విస్తాయని టాక్. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుందని అంటున్నారు.

Mana Shankara Vara Prasad Garu Movie Review మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ రివ్యూ

సెకండ్ హాఫ్ ప్రారంభంలో కథ కాస్త నెమ్మదించినా, విక్టరీ వెంకటేశ్ ఎంట్రీతో సినిమా మరో ట్రాక్‌లోకి వెళ్లిపోతుందట. ఆ తర్వాత ఎమోషన్, కామెడీ కలగలిపి అనిల్ రావిపూడి తన స్టైల్‌లో కథను నడిపించినట్టు సమాచారం. పాటలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హుక్ స్టెప్ ఉన్న తొలి పాట అభిమానులకు మంచి జోష్ ఇస్తుందని చెబుతున్నారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాపై పూర్తి స్థాయి రివ్యూ రావాలంటే ఇంకా కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. కానీ ప్రీమియర్ టాక్ ప్రకారం మాత్రం… సంక్రాంతికి sankranti festival మెగాస్టార్ అభిమానులు Megastar Fnas , ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇది మంచి విందుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి .

 

నటీనటులు : చిరంజీవి, వెంకటేష్, నయనతార, కేథరిన్ థెరిసా, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, సుదేవ్ నైర్, మాస్టర్ రేవంత్ మరియు ఇతరులు
దర్శకుడు : అనిల్ రావిపూడి
నిర్మాణం : సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
సంగీతం : భీమ్ సిసిరోలియో
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
కూర్పు : తమ్మిరాజు

కథ:

భారతీయ సెక్యూరిటీ ఏజెన్సీలో చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా పనిచేస్తున్న శంకర వరప్రసాద్‌ (చిరంజీవి) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌. అతని జీవితంలో అనుకోకుండా పేరు మోసిన బిజినెస్ మ్యాగ్నెట్‌, జీవీఆర్ గ్రూప్స్ అధినేత్రి శశిరేఖ (నయనతార) పరిచయం అవుతుంది. మాటలు లేకుండానే మొదలైన వారి అనుబంధం ప్రేమగా మారి చివరకు పెళ్లి వరకు వెళ్తుంది.

అయితే శశిరేఖ తండ్రి (సచిన్ ఖేడేకర్) మాత్రం వరప్రసాద్‌ను ఆమెతో పాటు పిల్లల నుంచి దూరం చేస్తాడు. వీరి విడాకులకు కారణమైన ఆ బలమైన కారణం ఏంటి? మళ్లీ వరప్రసాద్ ఎలా శశిరేఖ కుటుంబంలోకి అడుగుపెడతాడు? ఈ సమయంలో మైనింగ్ మొఘల్ వెంకీ గౌడ (వెంకటేష్) ఎంట్రీతో పరిస్థితులు ఎలా మారతాయి?

ఇక సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ వీరేంద్ర పాండే (సుదేవ్ నైర్) శశిరేఖను, పిల్లలను హత్య చేయాలని ఎందుకు ప్రయత్నిస్తాడు? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

దర్శకుడు అనిల్‌ రావిపూడి టాలీవుడ్‌లో ఫెయిల్యూర్‌ లేకుండా అత్యంత సక్సెస్‌ రేట్‌ ఉన్న దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన సినిమాల్లో బలమైన కథ కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా ఆయన ఎలాంటి హద్దులకైనా వెళ్తాడు. కథ పరంగా పెద్దగా కొత్తదనం లేకపోయినా, స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌ చేసి సినిమా చూస్తున్నంత సేపు బోర్‌ అనిపించకుండా నవ్వులు పూయిస్తాడు. ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడంలో నిరంతరం సక్సెస్‌ అవుతూ వరుస విజయాలు అందుకుంటున్నాడు.

ఇప్పుడు చిరంజీవితో తెరకెక్కించిన మన శంకర వరప్రసాద్‌ గారు విషయంలోనూ అదే ఫార్ములాను అనిల్‌ రావిపూడి ఫాలో అయ్యాడు. సీన్‌ బై సీన్‌ కామెడీ ఎపిసోడ్లను పేర్చుకుంటూ కథను ముందుకు నడిపించాడు. ఎక్కడా డల్‌ ఫీలింగ్‌ రాకుండా చూసుకుంటూ, టెంపో తగ్గే సమయంలో వెంటనే బలమైన కామెడీ బ్లాక్‌ను ప్లాన్‌ చేసి నవ్వులు పూయించాడు. అయితే ఇలాంటి సినిమాల్లో కామెడీ సరిగ్గా వర్కౌట్‌ కాకపోతే మొత్తం సినిమా తేడా కొట్టే ప్రమాదం ఉంటుంది. అదే దర్శకుడికి కత్తిమీద సాము లాంటిది. ఆ విషయంలో అనిల్‌ రావిపూడి సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు.

ఈ సినిమాలో కథ కంటే స్క్రీన్‌ప్లే మీదే ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. కామెడీ పార్ట్‌ను బలంగా రాసుకుని, దానికి చిరంజీవిని పర్‌ఫెక్ట్‌గా యాడ్‌ చేశాడు. చిరంజీవిలోని పూర్తి కామెడీ టైమింగ్‌, ఫన్‌ యాంగిల్‌, స్టైల్‌, యాక్షన్‌ను గట్టిగా వాడుకున్నాడు అనిల్‌. ఫలితంగా ఆయా సీన్లు తెరపై బాగా ఎలివేట్‌ అయ్యి, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాయి. సినిమా ఆరంభంలో చిరంజీవిని సింపుల్‌గా పరిచయం చేసి, మంత్రి ప్రాణాలను రక్షించే యాక్షన్‌ సీక్వెన్స్‌తో మెగాస్టార్‌కు అదిరిపోయే ఎలివేషన్‌ ఇచ్చాడు. ఆ సన్నివేశాల్లో విజిల్స్‌ ఖాయం. “ఒకప్పుడు నేనెవరో అందరికీ తెలుసు… ఇప్పుడు పిల్లబచ్చాలకు కూడా నేనెవరో చూపిస్తాను” అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్‌లు అభిమానులను ఫుల్‌ జోష్‌లోకి తీసుకెళ్తాయి.

టీవీ సీరియల్‌ చూస్తూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం, దాన్ని తన జీవితానికి అన్వయించుకోవడం వంటి సన్నివేశాలు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. ఆ తర్వాత మంత్రి వద్ద చేసే రచ్చ, అకస్మాత్తుగా పడిపోవడం, ఆ గ్యాప్‌లోనే మళ్లీ రెచ్చిపోవడం లాంటి ఎపిసోడ్లను దర్శకుడు పర్‌ఫెక్ట్‌గా డిజైన్‌ చేశాడు. దీంతో ఆ సీన్లు తెరపై అదిరిపోయాయి.

హీరోయిన్‌ను కలిసే సన్నివేశాలు, ఇద్దరి మధ్య జరిగే మూగ సంభాషణ కూడా డిఫరెంట్‌గా ఆకట్టుకుంటుంది. పెళ్లి, వెంటనే మొదలయ్యే గొడవలు, విడిపోవడం—all ఇవన్నీ వేగంగా, ఎక్కడా గ్యాప్‌ లేకుండా హిలేరియస్‌గా నడిపించాడు దర్శకుడు. చిరంజీవి తన డైలాగ్‌ టైమింగ్‌తో రెచ్చిపోవడంతో డైలాగ్‌ కామెడీ మరింతగా వర్కౌట్‌ అయ్యింది. ఆయన యాక్టింగ్‌ తోడవడంతో నవ్వులు డబుల్‌ అయ్యాయి.

స్కూల్‌లో పిల్లలకు దగ్గరయ్యేందుకు చేసే ప్రయత్నాలు మొదట విఫలమై, ఆ తర్వాత వర్కౌట్‌ కావడం వినోదాన్ని పంచుతుంది. అలాగే బుల్లిరాజు ఎపిసోడ్‌ కూడా సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తంగా ఈ చిత్రం సంక్రాంతికి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టినట్టే.

రేటింగ్ 3/5

ఇది కూడా చ‌ద‌వండి === > Mana Shankara Vara Prasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా..?

ఇది కూడా చ‌ద‌వండి === > Mana Shankara Vara Prasad Garu Box Office Collections : ‘మన శంకర వరప్రసాద్ గారు’వసూళ్లు ఎంత వస్తే సేఫ్ అవుతాడో తెలుసా ?

ఇది కూడా చ‌ద‌వండి === > Sudigali Sudheer – Rashmi Gautam : మీము విడిపోయామంటూ సుధీర్ – రష్మిలు ఓపెన్ స్టేట్మెంట్

 

No liveblog updates yet.

LIVE UPDATES

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది