Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!
ప్రధానాంశాలు:
ఒక్క ఫోటో తో అందరి నోర్లు మూయించిన విఘ్నేష్ - నయన్
Nayanthara : నయనతార - విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తూ ఎనలేని అభిమానాన్ని సంపాదించిన ఆమె, లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిన నయనతార, ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న తర్వాత 2022 జూన్‌లో వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!
Nayanthara : విడాకుల పై నయన్ దంపతులు దేవుడి సాక్షి గా క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల నయనతార తన సోషల్ మీడియా ఖాతాలో ఓ కామెంటుతో వార్తల్లోకెక్కింది. “తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది పెద్ద మిస్టేక్. భర్త చేసే పనులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. పురుషులు మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను చాలా ఫేస్ చేశా” అంటూ నయనతార చేసిన పోస్టు ఆమె వైవాహిక జీవితంపై సందేహాలు కలిగించింది. దీంతో ఆమె తన భర్త విఘ్నేష్ శివన్‌కు విడాకులు ఇవ్వబోతోందన్న ప్రచారం నెట్టింట వైరల్ అయింది. అయితే ఆమె ఆ వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి చేశారన్నది స్పష్టత ఇవ్వలేదు.
అయితే తాజా ఫోటోలు ఈ వార్తలపై తెరపడినట్లైంది. నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు కలిసి పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు కలిసి సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపించారు. పిల్లలతో కలిసి వారి కుటుంబ సమేత దర్శనం ఈ విడాకుల ప్రచారానికి పరోక్షంగా ముగింపు పలికినట్టయింది. ఈ సంఘటనతో నయనతార – విఘ్నేష్ శివన్‌ల మధ్య ఎలాంటి గొడవలూ లేవని, వారి వైవాహిక బంధం బలంగా ఉందని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.