
ncb officers raid on sharukh khan house
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు ఎన్‌సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న తన తనయుడు ఆర్యన్ ఖాన్‌ను చూసి షారుఖ్ తన ఇంటికి తిరిగి వచ్చే లోపు ఎన్‌సీబీ అధికారులు ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మొత్తంగా డ్రగ్స్ కేసు వ్యవహారం బీ టౌన్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్యన్ ఖాన్‌కు బలమైన ఉచ్చు బిగుసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేయగా, తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇప్పటికి మూడు సార్లు పిటిషన్లు వేసినప్పటికీ ముంబై ప్రత్యేక కోర్టు వాటిని తిరస్కరిస్తూనే వస్తున్నది.
ncb officers raid on sharukh khan house
ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటున్నదనే అభిప్రయం వ్యక్తమవుతున్నది. ఇకపోతే షారుఖ్ ఖాన్ ఇంట్లో కూడా అధికారులు సోదలు చేయడం ద్వారా బలమైన సాక్ష్యాల కోసం ఎన్‌సీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు అవగతమవుతున్నది. ఆర్థర్ రోడ్డు నుంచి షారుఖ్ ఇంటికి వచ్చే లోపే మన్నాట్‌లో షారుఖ్ ఇంట్లో ఎన్‌సీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ పార్టీలో వాట్సాప్ చాటింగ్‌లో ఓ నటితో సంభాషించినట్లు అధికారులు సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీ టౌన్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే ఇంట్లో కూడా ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమెకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.
ncb officers raid on sharukh khan house
ఇకపోతే బెయిల్ పిటిషన్ తిరస్కరణల నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ తరఫున లాయర్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, ఈ నెల 26న సదరు పిటిషన్‌పై విచారణ జరగనుంది. మొత్తంగా తీగ లాగితే డొంక కదులుతున్న మాదరిగా ఆర్యన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో బీ టౌన్ సెలబ్రిటీల్లోనూ భయం మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరయ్యే లోపే కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారం ఎన్‌సీబీ అధికారులు చేజిక్కించుకుంటారని తెలుస్తోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.