Rashmi Gautam : రష్మీ గౌతమ్ చేసిన పనికి చెప్పు తీసుకొని కొడతా అన్న ఓ నెటిజన్ ..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 16 January 2023, 8:00 pm

Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదామని వచ్చిన రష్మిక మొదట్లో కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత ఎక్కువ ఛాన్సులు రాకపోవడంతో బుల్లితెరపై యాంకర్ గా మారింది. బుల్లితెరలో మోస్ట్ పాపులర్ షో అయిన జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది రష్మీ. అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో కూడా నటిస్తూ తనేంటో నిరూపించుకుంటుంది. అలాగే రష్మీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

అయితే తాజాగా సోషల్ మీడియాలో రష్మీ చేసిన వ్యాఖ్యలకు ఓ నేటిజన్ ఫైర్ అయ్యాడు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మనందరికీ తెలిసిందే రష్మీ మూగజీవాలను హింసిస్తే వాళ్లకు క్లాస్ పీకుతుందని. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ కోడిపందాలలో గెలిచాను అంటూ సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేశాడు. దీంతో రష్మి మూగజీవాలను హింసిచ్చి మీ పైశాచిక ఆనందం ఏంటి అని ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చింది. ఇదే విషయంపై మరో నెటిజన్ నీకు దమ్ముంటే జల్లికట్టుపై మాట్లాడు..

Netigen fire on anchor Rashmi Gautam comments

Netigen fire on anchor Rashmi Gautam comments

తమిళనాడు వాళ్లు నిన్ను చెప్పు తీసుకొని కొడతారు. అడగటానికి నీకు ధైర్యం లేదు. నిన్ను ఎంత పెద్ద స్టార్ ని చేసిన తెలుగు ఇండస్ట్రీ పై పడి ఎందుకు ఏడుస్తావు అని వల్గర్ గా కామెంట్లు చేశాడు. దీంతో రెచ్చిపోయిన రష్మీ మళ్లీ అతడికి గట్టిగా రిప్లై ఇచ్చింది. మీ ప్రతాపం నోరు లేని మూగజీవాలపైన, కోడి కాళ్లకు కత్తి కట్టి కారం పెట్టి రెచ్చగొట్టడం మీ సాంప్రదాయమా ఎవరు చేయమన్నారు అలా సమాజంలో జరుగుతున్న తప్పులపై ప్రశ్నించండి అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దీంతో రష్మీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp