Sreeleela : “ఏమే శ్రీలీల నీకు దమ్ముంటే ఆ పని చెయ్యవే” ఏంటి అంత మాట అనేసాడు..!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 4 April 2023, 9:00 am

Sreeleela : టాలీవుడ్ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క సినిమా పెళ్లి సందడితో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయింది. స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ అవకాశాలు చేజిక్కించుకుంటోంది. రెండో సినిమా ధమాకాతో ఇక ఇండస్ట్రీలో తనకు తిరుగులేదు అనిపించింది శ్రీలీల. ఇప్పుడు టాలీవుడ్ లో ప్రతి హీరో తన పక్కన నటించాలని కోరుకుంటున్నాడు. తను అందగత్తెతో పాటు బెస్ట్ డ్యాన్సర్. అందుకే తనకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

netizen challenged tollywood actress sreeleela

netizen challenged tollywood actress sreeleela

అయితే.. ఈ మధ్య సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో మాట్లాడుతున్నారు. వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. కొందరైతే సెలబ్రిటీలను నేరుగా ఇబ్బందికర ప్రశ్నలతో ఇబ్బందిపెడుతుంటారు. తాజాగా హీరోయిన్ శ్రీలీలకు ఓ నెటిజన్ సవాల్ విసిరాడు. ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఓ నెటిజన్ శ్రీలీలపై సవాల్ విసిరాడు. ఏమనో తెలుసా? మీ పోస్టులకు మేము లైక్ కొట్టడం కాదు..

star producer comment on sreeleela body shape

star producer comment on sreeleela body shape

Sreeleela : ఇంతకీ ఆ నెటిజన్ ఏం అడిగాడో తెలుసా?

మీకు దమ్ముంటే మా పోస్టులకు మీరు లైక్ కొట్టాలి అంటూ సవాల్ విసిరాడు. ఆ నెటిజన్ విసిరిన సవాల్ కు మరికొందరు నెటిజన్లు వత్తాసు పలికారు. అవును.. అవును మా పోస్టులకు లైక్ కొట్టాలి అంటూ శ్రీలీలకు సవాల్ విసిరుతున్నారు. దీంతో ప్రస్తుతం శ్రీలీల ఫోటోలు, నెటిజన్ల కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి. ఇంతకీ ఆ నెటిజన్ అడిగినట్టుగా వాళ్ల పోస్టులకు శ్రీలీల లైక్ కొడుతుందా? వేచి చూడాల్సిందే.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp