Navya Swami : నవ్యస్వామి ఫోటోలపై రవికృష్ణ.. వేరే పనేం లేదా? అంటూ నెటిజన్ ఫైర్
నవ్యస్వామి రవికృష్ణ కాంబినేషన్‌కు బుల్లితెరపై, సోషల్ మీడయాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె కథ సీరియల్‌తో మొదలైన ఈ జోడి ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.. ప్రేమలో ఉన్నారు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని లెక్కలేనన్ని రూమర్లు వ్యాప్తి చెందుతుంటాయి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతుంటారు.
సీరియల్స్ కాకుండా ఇతర షోల్లో వీళ్లు ఇద్దరూ చేసే రొమాన్స్ మామూలుగా ఉండదు. ముద్దులు పెట్టుకుంటారు. హగ్గులతో రెచ్చిపోతోంటారు. కానీ తామిద్దరం మాత్రం మంచి స్నేహితులమేనని అంటుంటారు. అలా ఈ ఇద్దరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక నవ్యస్వామి ఫోటోను షేర్ చేస్తే క్షణం ఆలస్యం కాకుండా కామెంట్ పెడతాడు.
Navya Swami : నవ్యస్వామిపై రవికృష్ణ కామెంట్..
అది కూడా మూడు లవ్ సింబల్స్‌ను మాత్రమే షేర్ చేస్తుంటాడు. నవ్యస్వామి పోస్ట్ చేస్తే కచ్చితంగా రవి కృష్ణ కామెంట్ ఉండాల్సిందే. తాజాగా నవ్యస్వామి షేర్ చేసిన ఫోటో షూట్ కింద కూడా రవికృష్ణ మూడు లవ్ సింబల్స్‌ను షేర్ చేశాడు. ఇక వీటిని చూసిన ఓ నెటిజన్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఢీ షోలో పులిహోర కలపడమే. ఇక్కడ కూడా పులిహోర కలపడమేనా? నీకు వేరే పని లేదా? అంటూ కౌంటర్ వేశాడు.