Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుధీర్ అంటే ఓ రేంజ్ డిమాండ్ ఉంటుంది. బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా దూసుకుపోతోన్నాడు. అయితే ఈ మధ్యే సుధీర్ వ్యవహారం కాస్త తేడా కొడుతోంది.మెల్లిమెల్లిగా మల్లెమాలకు దూరంగా జరుగుతున్నాడు. మొదటగా ఢీ నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత కొన్ని రోజులకు ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు. అయితే సినిమా అవకాశాలు వస్తుండటంతో ఇలా దూరమయ్యాడని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే స్టార్ మాలో ప్రారంభమైన కొత్త పాటల ప్రోగ్రాంకు హోస్ట్‌గా మారిపోయాడు. దీంతో మల్లెమాలలో విబేధాలు వచ్చాయని అర్థమైంది.
ఇక ఉన్నట్టుండి శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచికూడా బయటకు వచ్చేశాడు. సుధీర్ బయటకు రావడమే కాదు.. ఇంద్రజను కూడా బయటకు పట్టుకొచ్చినట్టు కనిపిస్తోంది. ఇంద్రజ ఇక మొత్తానికి జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకే పరిమితం కానట్టుంది. శ్రీదేవీ డ్రామా కంపెనీకి పూర్ణ వచ్చేసింది. అలా మొత్తానికి ఈ ఆదివారం నాడు ప్రసారమైన షోలో మాత్రం రష్మీ, పూర్ణ కనిపించారు. ఇకపై వారే కనిపించనున్నట్టు తెలుస్తోంది.కానీ సుధీర్ అభిమానులు మాత్రం తెగ హర్ట్ అవుతున్నారు. సుధీర్ లేని షోను మేం చూడలేము.. సుధీరే యాంకర్‌గా రావాలంటూ అభిమానులు కోరుతున్నారు.
శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్ కింద యూట్యూబ్‌లో సుధీర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. వీ వాంట్ సుధీర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి రష్మీని కూడా జనాలు అంగీకరించడం లేదు. వారికి కేవలం సుధీర్ మాత్రం కావాలనే కోరుతున్నారు. మొత్తానికి సుధీర్ అభిమానులు మాత్రం బాగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి సుధీర్ మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వడం అన్నది సాధ్యమేనా? మల్లెమాల టీంతో ఏర్పడిన గ్యాప్ తగ్గేనా? స్టార్ మా వాళ్లు సుధీర్‌ను వదులుతారా?. ఇక మరో వైపు సుధీర్ తన సినిమా మీదే ఫోకస్ పెడతాడు కాబట్టి బుల్లితెరను అంతగా పట్టించుకోడా? అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.