Sai Pallavi : వాళ్ళిద్దరు నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అంటూ సాయి పల్లవిపై నెటిజన్స్ కామెంట్స్..

Authored By vamana sai | The Telugu News | Published on: July 2, 2022, 3:30 pm

Sai Pallavi : ఫిదా బ్యూటీ సాయి పల్లవి నెమ్మదిగా సంచలనం అవుతూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి సరసన వాస్తవ సంఘటనల ఆధారంగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాట పర్వం సినిమా ఇటీవల వచ్చి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్ అంతా కూడా సాయి పల్లవిని ఆధారంగా చేసుకొనే తనకున్న ఇమేజ్‌ను అడ్డంపెట్టుకునే చేశారు. అయినా ఫలితం లేకపోయింది. చెప్పాలంటే సాయి పల్లవి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ కూడా సాధించడం లేదు.

చేసిన సినిమాలలో ఎక్కువగా ఫ్లాప్సే ఉన్నాయి. అయినా కూడా ఆమె క్రేజ్ విపరీతంగా పెరుగుతుంది. అయితే, సాయి పల్లవి మొదటి సినిమా మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించింది. ఆ సినిమాతోనే ఇప్పటికీ ఫిదా బ్యూటీ అని పిలిపించుకునేంత క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన రెండు సినిమాలు చేసింది. శర్వానంద్ సరసన ఒక సినిమా, నాగ చైతన్య సరసన ఒక సినిమా చేసింది. రానా సరసన ఒక సినిమా చేసింది. అయితే, ఇంతకాలం అందరూ సాయి పల్లవికి ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే దర్శకుడు శేఖర్ కమ్ముల అనుకున్నారు. లేదంటే నాని అని అనుకున్నారు. దీనికి కారణం హీరోయిన్‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రెండు సినిమాలు చేసింది.

Netizens comments on Sai Pallavi

Netizens comments on Sai Pallavi

Sai Pallavi : ఆ రకంగా ఎందుకు ఆలోచించడం లేదు..!

అలాగే, నాని సరసన రెండు సినిమాలు చేసింది. కానీ, వీరిద్దరూ కాకుండా నాగ చైతన్య, రానా దగ్గుబాటి తనకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడం చాలామందికి షాకింగ్‌గా అనిపిస్తుంది. అసలు సాయి పల్లవి చెప్పిన మాట చాలామందికి నమ్మశక్యంగా లేదంటున్నారు. దీనిపై నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న టాక్ ప్రకారం మాత్రం లవ్ స్టోరి, విరాట పర్వం సినిమాలకు ఎక్కువ రోజులు కలిసి పనిచేయడం వల్ల మంచి బాండింగ్ ఏర్పడి ఉండొచ్చు కదా..మెంటాలిటీస్ పరంగా సాయి పల్లవికి రానా, చైతూ కనెక్ట్ అయి ఉండొచ్చు కదా..ఆ రకంగా ఎందుకు ఆలోచించడం లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైన ఊహించని పేరు చెప్పి సాయి పల్లవి మెగా అభిమనానులను, నాని ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిందంటున్నారు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp