Home » Entertainment » Netizens Fires On Poorna Rashmi Guatam And Mallemala Sridevi Drama Company
Entertainment

Sridevi Drama Company : ఇవే తగ్గించుకుంటే మంచిది!.. మల్లెమాల టీంను ఆడేసుకుంటున్న నెటిజన్లు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: May 31, 2022, 9:00 pm
Advertisement

Sridevi Drama Company : బుల్లితెరపై ఓ షోను హిట్ చేయడానికి ఎన్నెన్నో పద్దతులుంటాయి. ఎన్నో ఎమోషన్లతో షోలను హిట్ చేసుకుంటారు. కొందరు కంటతడి పెడుతూ నటిస్తే.. ఇంకొందరు ఆగ్రహావేశాలతో ఊగిపోతోంటారు. అలా ఎపిసోడ్‌లో నడిచేది ఎంతో తెలియదు గానీ ప్రోమోలో మాత్రం పెద్ద యుద్దాలే జరిగినట్టు చూపిస్తుంటారు. ఇప్పుడంతా కూడా ప్రోమోల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. కావాలనే ప్రోమోలను కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌ అన్నట్టుగా కట్ చేస్తుంటారు. ఈ ట్రిక్కులను జనాలు పసిగట్టేస్తున్నారు.

Advertisement

ఒకప్పుడు ప్రోమోలను చూసి నమ్మేవారు. కానీ రాను రాను పరిస్థితి మారుతూ వచ్చింది. ప్రోమోల్లో ఉండే విషయం, ఆ ఘాడత ఎపిసోడ్‌‌లో ఉండదని అందరికీ అర్థమైంది. ప్రోమోలు ఎంత కాంట్రవర్సీగా ఉంటే ఎపిసోడ్ అంత చప్పగా ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మాత్రం కాస్త అతిగానే అనిపించింది. పూర్ణ భుజం మీద ఇమాన్యుయేల్ చేతులు వేయడం, దీంతో పూర్ణ తెగ బాధపడిపోయింది. తననేదో చేసేశారన్నట్టుగా అక్కడ రచ్చ చేసింది.

Netizens Fires On Poorna Rashmi Guatam And Mallemala Sridevi Drama Company

Advertisement

మొత్తానికి ఇమాన్యుయేల్‌ను మాత్రం నిందితుడిగా చేసింది. అలా ఎలా టచ్ చేస్తావ్ అంటూ ఇమాన్యుయేల్‌ను నిలదీయడం, పూర్ణ ఎమోషనల్ అవ్వడం ఇవన్నీ ఒకెత్తు అయితే చివర్లో రష్మీ ఇచ్చిన పర్ఫామెన్స్ ఓ లెవెల్‌లో ఉంది. రష్మీ ఇదంతా చూసి కళ్లు తిరిగి పడిపోయినట్టు బిల్డప్ ఇచ్చింది. మొత్తానికి రష్మీ, పూర్ణ ఇద్దరూ మాత్రం వచ్చీ రాగానే షో మీద తమ మార్క్ చూపించేశారు. ఇక నెటిజన్లు ఈ ఇద్దరి మీద, మల్లెమాల మీద దారుణంగా ట్రోల్స్ చేసి పడేస్తున్నారు.

మీ ప్రోమోలు చూస్తుంటే మేం కళ్ళు తిరిగి పడి పోతున్నాం రా బాబు, స్వామి ప్రోగ్రాం చేయండి అంతే కానీ జనాలు పిచ్చి వాళ్లను చేయకండి, చుాశాం చుాసాం.. చాలా చూసాం ఇలాంటి ప్రాంకులు..ఒక్కోక్కరు ఆస్కార్ లెవెల్ పర్ఫామెన్స్‌లు, లాస్ట్‌లో పూర్ణ, రష్మీ యాక్టింగ్ వేరే లెవెల్.. ఇలాంటివి చాలా చూశాం అయ్యయ్యో వొద్దమ్మ చూసి చూసి బోర్ కొట్టేస్తుంది , లాస్ట్లో కామెడీ బాగుంది ఆస్కార్ యాక్టింగ్ చేశారు సూపర్, ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ నెటిజన్లు మల్లెమాలను ఏకిపాడేస్తున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి