New Film : సరికొత్త ఫీల్‌తో తెరకెక్కుతున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రం.. టైటిల్ లుక్ విడుదల..

Advertisement

New Film : ఇటీవల కాలంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలు బాగా పెరుగుతున్నాయి. బయోపిక్స్ మాత్రమే కాకుండా ఏదేని సంఘటనలోని కొంత భాగాన్ని తీసుకుని సినిమాటిక్ ఎక్స్ ప్రెషన్స్ యాడ్ చేసి ఫిల్మ్స్ తీస్తూ డైరెక్టర్స్ సక్సెస్ అవుతున్నారు కూడా. ఈ క్రమంలోనే యూత్ ను టార్గెట్ చేస్తూ కూడా సినిమాలు వస్తున్నాయి. ఇటీవల సంక్రాంతి బరిలో నిలిచి విడుదలైన ‘రౌడీ బాయ్స్’పిక్చర్ యూత్ టార్గెటెడ్. కాగా, తాజాగా మరొ యూత్ టార్గెటెడ్ ఫిల్మ్ రాబోతున్నది.నేటి తరం దర్శకులు ఇలా సరికొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్నారు కూడా.

Advertisement

ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ శ్రీనాథ్ కాలేజీ లైఫ్ లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా చిత్రం తీస్తున్నారు. దానికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రమోషన్స్ పైన ఫోకస్ పెట్టిన మూవీ యూనిట్ సభ్యులు తాజాగా టైటిల్ లుక్ రిలీజ్ చేశారు. బ్లాక్ యాంట్ పిక్చర్స్ బ్యానర్‌పై అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు.శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫర్.

Advertisement
new film title look released by makers
new film title look released by makers

New Film : యథార్థ సంఘటన ఆధారంగా..

అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా పిక్చర్ రూపొందించినట్లు, ఈ చిత్రంలో సరి కొత్త ఫీల్ ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిత్ర స్టోరి విషయానికొస్తే.. ఇది ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరి కాగా, ఇందులో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రలు పోషించారు. వాలెంటైన్స్ డే కానుకగా ఈ నెల 14న మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.

Advertisement
Advertisement