new film title look released by makers
New Film : ఇటీవల కాలంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలు బాగా పెరుగుతున్నాయి. బయోపిక్స్ మాత్రమే కాకుండా ఏదేని సంఘటనలోని కొంత భాగాన్ని తీసుకుని సినిమాటిక్ ఎక్స్ ప్రెషన్స్ యాడ్ చేసి ఫిల్మ్స్ తీస్తూ డైరెక్టర్స్ సక్సెస్ అవుతున్నారు కూడా. ఈ క్రమంలోనే యూత్ ను టార్గెట్ చేస్తూ కూడా సినిమాలు వస్తున్నాయి. ఇటీవల సంక్రాంతి బరిలో నిలిచి విడుదలైన ‘రౌడీ బాయ్స్’పిక్చర్ యూత్ టార్గెటెడ్. కాగా, తాజాగా మరొ యూత్ టార్గెటెడ్ ఫిల్మ్ రాబోతున్నది.నేటి తరం దర్శకులు ఇలా సరికొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్నారు కూడా.
ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ శ్రీనాథ్ కాలేజీ లైఫ్ లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా చిత్రం తీస్తున్నారు. దానికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రమోషన్స్ పైన ఫోకస్ పెట్టిన మూవీ యూనిట్ సభ్యులు తాజాగా టైటిల్ లుక్ రిలీజ్ చేశారు. బ్లాక్ యాంట్ పిక్చర్స్ బ్యానర్‌పై అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు.శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫర్.
new film title look released by makers
అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా పిక్చర్ రూపొందించినట్లు, ఈ చిత్రంలో సరి కొత్త ఫీల్ ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిత్ర స్టోరి విషయానికొస్తే.. ఇది ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరి కాగా, ఇందులో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రలు పోషించారు. వాలెంటైన్స్ డే కానుకగా ఈ నెల 14న మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.