Hyper Aadi : మళ్లీ మిస్సయిన హైపర్ ఆది.. శ్రీదేవి డ్రామా కంపెనీ బారం మొత్తం పంచ్‌ ప్రసాద్‌ పైనే!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: February 23, 2022, 7:00 pm

Hyper Aadi : ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో మంచి సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతుంది. ఈ షో కి యాంకర్ గా సుదీర్ వ్యవహరిస్తుండగా జడ్జిగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ లో ఉండే ఎంతో మంది కమెడియన్స్ ను ఇందులో దించారు. దాంతో జబర్దస్త్ లోనే ఈ షో కూడా మంచి సక్సెస్ ని దక్కించుకుంది. పెద్ద ఎత్తున రేటింగ్‌ వస్తున్న నేపథ్యంలో మరింత క్రియేటివిటీ గా ఈ షో ముందుకు తీసుకెళ్తున్నారు. వారం వారం విభిన్నమైన కాన్సెప్ట్ లతో తీసుకు వెళుతున్న కారణంగా మంచి స్పందన వస్తుంది. ఆదివారం ప్రసారమయ్యే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కి వస్తున్న ఈ ఆదరణతో నిర్వాహకులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ఈ సమయంలో షో నుండి హైపర్ ఆది తప్పుకున్నట్లు గా వస్తున్న వార్తలు ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తున్నాయి. మొన్నటి ఆదివారం టెలికాస్ట్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో ఆది కనిపించలేదు. ఆది లేని లోటు క్లియర్ గా ఉంది అంటూ మనం ఇప్పటికే చర్చించుకున్నాం. తాజాగా విడుదలయిన వచ్చే ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో లో కూడా ఆది కనిపించలేదు దాంతో ఇక పై శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది ఉండటం అంటూ చర్చ మొదలైంది. ఆది లేకపోతే ఈ షో కి పెద్దగా ఆదరణ వుండదు అనే టాక్ వినిపిస్తోంది. హైపర్ ఆది వేసిన పంచులు షో కు కచ్చితంగా అదనపు ఆకర్షణగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పుడు హైపర్ ఆది లేడు కనుక ఆ స్థానం ను పంచ్ ప్రసాద్ భర్తీ చేయాల్సి ఉంటుంది.

next week Sreedevi drama company episode also dont have Hyper Aadi

next week Sridevi Drama Company episode also dont have Hyper Aadi

పంచ్ ప్రసాద్ పంచులు వేస్తాడు కానీ ఆయన పంచులు హైపర్ ఆది స్థాయిలో ఉండవు. హైపర్ ఆది, పంచ్ ప్రసాద్, రాంప్రసాద్ మరియు సుధీర్ ఇలా ప్రతి ఒక్కళ్ళు ఉంటేనే షో కు అందం మరియు ఆనందం అన్నట్లుగా నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీవీ ప్రేక్షకులు కచ్చితంగా హైపర్ ఆది ఉండాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ వచ్చేవారం కాకుండా ఆ తదుపరి వారం అయినా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ లో సందడి చేస్తాడో చూడాలి. వచ్చే వారం షో లో అన్నపూర్ణమ్మ తో పాటు ఇంకా పలువురు సీనియర్ బుల్లి తెర మరియు వెండి తెర స్టార్స్ రాబోతున్నారు. వారు చేసిన సందడికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఆది ఉంటే మరింత హైలైట్‌ గా ఉండేదనే టాక్‌ వినిపిస్తుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Bathing Dinner : భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది? నిజం ఇదే"

  2. "Radhika Apte : 41 ఏళ్లలోనే నా శరీరం, కోరికలపై అసలైన క్లారిటీ వచ్చింది: రాధికా ఆప్టే"

  3. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  4. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  5. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  6. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  7. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp