Nidhi Agarwal : హరిహర వీరమల్లు నుంచి నిధి అగర్వాల్ ఔట్.. అసలు ఏం జరిరింది..?
Nidhi Agarwal : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయాల నుంచి విరామం తీసుకున్న అనంతరం పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీగా మారారు. వరుస సినిమాల షూటింగ్ లతో ఖాళీ సమయమనదే లేకుండా గడుపుతున్నారు. అయితే ఆయా సినిమాల్లోని మోస్ట్ అవైటెడ్ చిత్రం హరి హర వీరమల్లుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.రి హర వీరమల్లు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్ ఈ మూవీ నుంచి ఆమె తప్పుకుందనే వార్తలు వచ్చి సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
హ ఏవో కారణాల చిత్ర బృందం నిధిని ఈ చిత్రం నుంచి తప్పించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోవడానికి అప్పుడే వేట ప్రారంభించారని అంటున్నారు. అయితే ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో నిధి తొలగింపుపై వస్తున్నవన్ని కేవలం రూమర్సేనని సమాచారం. సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి విడుదలైన పోస్టర్ లలో, పవన్, నిధిలా పాత్రల పరిచయాలు సినిమాపై ఉన్న క్రేజ్ ను మరింత పెంచేశాయి.

Nidhi Agarwal Out Form pawan kalyan harihara veeramallu Movie
Nidhi Agarwal : నిధి సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వైరల్..!
సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయినట్లు సమాచారం. షూట్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రామ్ పాల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. క్రిష్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.