
Niharika : దాని కోసం అయిన మళ్లీ పెళ్లి చేసుకుంటా.. మొదటి వివాహం అందుకే ఫెయిల్ అన్న నిహారిక
Niharika : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తరువాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మెగా ఫ్యామిలీకి ఇష్టం లేకపోయిన బలవంతంగా ఒప్పించి సినిమాలలోకి వెళ్లింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యతో ఘనంగా వివాహం చేసుకుంది. ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లైన రెండేళ్లకే వారు విడాకులు తీసుకున్నారు.
నిహారిక విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. విడిపోతామని తెలిసి ఎవరూ పెళ్లి చేసుకోరని వెల్లడించింది. అది కూడా ఎంతో గ్రాండ్‌గా.. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి అసలే సెలబ్రేషన్స్ చేయరని పాడ్ కాస్ట్ లో తెలిపింది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని.. నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను అని పేర్కొంది.
Niharika : దాని కోసం అయిన మళ్లీ పెళ్లి చేసుకుంటా.. మొదటి వివాహం అందుకే ఫెయిల్ అన్న నిహారిక
భవిష్యత్‌లో రెండో పెళ్లి చేసుకుంటారా అని నిహారికకి పదే పదే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే గతంలో తప్పక పెళ్లి చేసుకుంటానని చెప్పిన నిహారిక.. బంధం ఫెయిల్ అయినంత మాత్రాన మరొకరి మీద ప్రేమ కలగదు అని కాదు. ఖచ్చితంగా పుడుతుంది. పిల్లల కోసం అయిన తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. పిల్లలు అనే కాదు కాని ఒక బంధం కోసం అయిన పెళ్లి చేసుకుంటానని పేర్కొంది. అయితే ప్రస్తుతం నా దృష్టి వర్క్ మీదే ఉంది. సమయం వచ్చినప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా… ఇంట్లో వాళ్ళ ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటాను అని పేర్కొంది. ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.