Venu Swamy : బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??
Venu Swamy : సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల తో పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ సూపర్ పాపులర్ అయ్యారు వేణుస్వామి. ఈ జ్యోతిష్యుడు చెప్పిన చాలా అంచనాలు నిజమయ్యాయి. ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎక్కడా లేని పాపులారిటీ వచ్చి పడింది. ఈ మధ్య వేణు స్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పారు కానీ అది జరగలేదు. దాని తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ఒక సంచలన ప్రకటన చేశారు.
తర్వాత ఈ పాపులర్ ఆస్ట్రాలజర్ కనిపించకపోయినా సరే, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఆయన గురించే వీడియోలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్‌లు, మీమ్స్ అన్నీ హల్చల్ చేస్తున్నాయి. అయితే వేణు స్వామి ఇంటర్నెట్ యూజర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా వారు మాత్రం ఆయన్ను వదలడం లేదు. ఆయనకు ఉన్న ఈ క్రేజ్‌ని బిగ్ బాస్ టీం గుర్తించినట్లు ఉంది. అందుకే నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. వేణు స్వామి కోసమైనా చాలామంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారని బిగ్ బాస్ నిర్వహకులు నమ్ముతున్నారట. ఆ కారణం చేతే ఆయనను సంప్రదించారని, బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేయడానికి వేణు స్వామి కూడా ఒప్పుకున్నారని టీవీ సర్కిల్ లో ప్రచారం జోరుగా సాగుతోంది.
అంతేకాదు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకొని పారితోషికం వేణు స్వామి తీసుకుంటున్నారట. మొదటగా ఆయన చాలా రెమ్యునరేషన్ అడిగారని అయితే బిగ్‌బాస్ టీమ్ తొలుత సందేహించినా ఆ తర్వాత అతనికున్న క్రేజ్ ను చూసి ఓకే చెప్పిందని సమాచారం. మొత్తం మీద ఈసారి వేణు స్వామి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. హౌస్ లో అడుగు పెట్టాక ఆయన ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో ? హౌస్ లో జరగబోయే విషయాలను ముందుగానే జాతకం ద్వారా తెలుసుకొని చెప్పగలరా ? అనేది ప్రస్తుత ఆసక్తికర అంశంగా మారింది.
Venu Swamy : బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??
వేణు స్వామి కాకుండా ఇంకా ఈసారి ఎవరెవరిని తీసుకుంటారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. బర్రెలక్కను సెలెక్ట్ చేశారని, కుమారి ఆంటీ కూడా సెలెక్ట్ అయ్యారంటూ పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సారి వేణు స్వామి ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ షేక్ అవ్వడం ఖాయం గా కనిపిస్తుంది.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.