Niharika : దాని కోసం అయిన మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటా.. మొద‌టి వివాహం అందుకే ఫెయిల్ అన్న నిహారిక‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Niharika : దాని కోసం అయిన మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటా.. మొద‌టి వివాహం అందుకే ఫెయిల్ అన్న నిహారిక‌

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2024,7:10 pm

ప్రధానాంశాలు:

  •  Niharika : దాని కోసం అయిన మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటా.. మొద‌టి వివాహం అందుకే ఫెయిల్ అన్న నిహారిక‌

Niharika : మెగా డాట‌ర్ నిహారిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తరువాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మెగా ఫ్యామిలీకి ఇష్టం లేక‌పోయిన బ‌ల‌వంతంగా ఒప్పించి సినిమాల‌లోకి వెళ్లింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో ఘ‌నంగా వివాహం చేసుకుంది. ఆమె పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అయితే పెళ్లైన రెండేళ్ల‌కే వారు విడాకులు తీసుకున్నారు.

Niharika ప‌క్కా చేసుకుంటాను..

నిహారిక విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. విడిపోతామని తెలిసి ఎవరూ పెళ్లి చేసుకోరని వెల్లడించింది. అది కూడా ఎంతో గ్రాండ్‌గా.. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి అసలే సెలబ్రేషన్స్‌ చేయరని పాడ్ కాస్ట్ లో తెలిపింది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని.. నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను అని పేర్కొంది.

Niharika దాని కోసం అయిన మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటా మొద‌టి వివాహం అందుకే ఫెయిల్ అన్న నిహారిక‌

Niharika : దాని కోసం అయిన మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటా.. మొద‌టి వివాహం అందుకే ఫెయిల్ అన్న నిహారిక‌

భ‌విష్య‌త్‌లో రెండో పెళ్లి చేసుకుంటారా అని నిహారిక‌కి ప‌దే ప‌దే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. అయితే గ‌తంలో త‌ప్ప‌క పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన నిహారిక‌.. బంధం ఫెయిల్ అయినంత మాత్రాన మరొకరి మీద ప్రేమ కలగదు అని కాదు. ఖచ్చితంగా పుడుతుంది. పిల్ల‌ల కోసం అయిన త‌ప్ప‌కుండా పెళ్లి చేసుకుంటాను. పిల్ల‌లు అనే కాదు కాని ఒక బంధం కోసం అయిన పెళ్లి చేసుకుంటాన‌ని పేర్కొంది. అయితే ప్రస్తుతం నా దృష్టి వర్క్ మీదే ఉంది. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా… ఇంట్లో వాళ్ళ ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటాను అని పేర్కొంది. ఆమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది