Home » Entertainment » Niharika Husband Clears The Rumors
Entertainment

Niharika : నిహారిక విడాకుల‌పై ప్ర‌చారాలు.. ఆమె భ‌ర్త ఏమ‌ని అన్నాడంటే..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 15, 2022, 9:30 pm
Advertisement

Niharika : మెగా ఫ్యామిలీలో విడాకుల వ్య‌వ‌హారాలు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తొలి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంది. అత‌నితోను శ్రీజ విడిపోయింద‌నే ప్ర‌చారాలు జోరుగా న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే నిహారిక విడాకుల వ్య‌వ‌హారం కూడా హైలైట్ అయింది.2020, డిసెంబర్‌9న చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకొని అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్‌ లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేస్తుంది. అయితే రీసెంట్‌గా జిమ్‌లో నిహారిక షేర్‌ చేసిన ఓ వీడియోపై ట్రోల్స్‌ రావడంతో అకౌంట్‌ డిలీట్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తుంది. ఈ వీడియో వ‌ల‌న నిహారిక ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు తలెత్తాయ‌ని త్వ‌ర‌లో నిహారిక విడాకులు తీసుకోనుందంటూ ప్ర‌చారం న‌డుస్తుంది.

Advertisement

ఈ రూమర్లపై చైతన్య జొన్నలగడ్డ చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. తామిద్దరం ఎంత చక్కగా కలిసి ఉన్నారో, అన్యోన్యంగా ఉన్నారో చెప్పకనే చెప్పేశాడు. నిహారిక ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసి రూమర్లకు చెక్ పెట్టేశాడు. ‘కొత్త వీల్ అందుకున్న నిహారిక ఏం చేస్తుందో చూడండి..’ అని పేర్కొన్నాడు. నిహారిక ఆ ఫోటోలో నవ్వుతూ కనిపించింది. అయితే నిహారిక ఇలా సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉందన్న విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. వెబ్ సిరీస్‌లో నటిస్తూ, నిర్మిస్తూ నిహారిక సందడి చేస్తోంది. గత ఏడాది నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ అద్భుతమైన విజయాన్ని సాధించింది.

niharika husband clears the rumors

Advertisement

Niharika : నిహారిక భ‌ర్త అలా చెక్ పెట్టేశాడు..

హీరోయిన్ గా ఎదిగాలన్న ఆశలతో నటిగా నిహారిక ఎంట్రీ ఇచ్చారు. ఆమె కుటుంబానికి చెందిన స్టార్ హీరోలు అరడజను పైగా ఉన్న పరిశ్రమలో నిహారిక స్టార్ హీరోయిన్ కావడం పెద్ద విషయం కాదు. అయితే చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ పట్ల ప్రజల్లో ఉండే అభిప్రాయం దృష్టిలో ఉంచుకొని వారు ఆమెను ప్రోత్సహించలేదు. ‘ఒక మనసు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాలు నటించారు. ఆమె నటించిన చిత్రాలన్నీ పరాజయం పొందాయి. మెగా ఫ్యామిలీ తలచుకుంటే ఆమెకు ఆఫర్స్ వచ్చేలా చేయడం విషయం కాదు. మరోవైపు మెగా డై హార్డ్ ఫ్యాన్స్ కి నిహారిక హీరోయిన్ కావడం అసలు ఇష్టం లేదు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి