Niharika Konidela : నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఆడవాళ్లలో ఇండస్ట్రీకి వచ్చింది తను మాత్రమే. మెగా ఫ్యామిలీలో చాలామంది మహిళలు ఉన్నా ఎవ్వరూ ఇండస్ట్రీలో నటన గురించి ఆలోచించలేదు. కానీ.. అందరికంటే భిన్నంగా నిహారిక మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ అయింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా తనకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత తండ్రి చెప్పిన సంబంధానికి ఓకే చెప్పింది. చైతన్యను పెళ్లి చేసుకుంది. అసలు సినిమా ఇండస్ట్రీలోనే నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లో తన పెళ్లి ఘనంగా జరిగింది. తన పెళ్లి గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది.
కానీ.. తన పెళ్లి కొన్నేళ్లకే పెటాకులు అయింది. పెళ్లి అయి కొన్నేళ్లు అయినా నిహారిక పిల్లలను కనలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకే నిహారిక, చైతన్య ఇద్దరూ విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు పుల్ స్టాప్ అయితే పెట్టలేదు కానీ.. చివరకు ఇద్దరం నిజంగానే విడాకులు తీసుకున్నాం అని నిహారిక, చైతన్య ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇక.. ఆ తర్వాత చాలా రోజుల పాటు నిహారిక బయట తిరగలేదు. అస్సలు ఎక్కడా కనిపించలేదు. తొలిసారి విడాకులు తర్వాత మీడియాతో మాట్లాడింది నిహారిక. తాజాగా హైదరాబాద్ లో నైరా సిల్క్స్ పేరుతో కంచి శారీ హౌస్ ను ప్రారంభించింది. తనతో పాటు వరుణ్ సందేష్ భార్య వితికా షేరు కూడా ఈ స్టోర్ ను లాంచ్ చేసింది.
నైరా సిల్క్స్ లో కంచి పట్టు చీరలన్నీ ఒకే స్టోర్ లో దొరుకుతాయి అని నిహారిక చెప్పింది. మీకు నచ్చిన శారీలను కొనుక్కోండి అని చెప్పింది నిహారిక. తన విడాకుల తర్వాత తొలిసారి చాలా సంతోషంగా కనిపించింది నిహారిక. అంటే.. తన విడాకులను మరిచిపోయి మళ్లీ కొత్త జీవితాన్ని నిహారిక ప్రారంభిస్తున్నట్టు తనను చూస్తే అనిపిస్తోంది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.