
Niharika konidela : నిహారిక కొత్త వీడియోపై నెటిజన్ల రియాక్షన్ ఇదే .. రోజు ఈ టార్చర్ ఏంటి అంటూ కామెంట్స్..!
Niharika konidela : సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక ఏ రేంజ్ లో వైరల్ అవుతుంటారో అందరికీ తెలుసు. నిత్యం ఏదో ఒక వార్తతో నెట్టింటా ట్రెండ్ అవుతుంటారు. ఇక మనకు తెలిసిందే నిహారిక యాంకర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేశారు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. దీంతో మెగా ఫ్యామిలీ నిహారికను జొన్నలగడ్డ చైతన్యకు ఇచ్చి వివాహం చేశారు. కానీ ఆ పెళ్లి మూణ్ణాల ముచ్చట గానే సాగింది. పెళ్లయిన రెండు సంవత్సరాలకే నిహారిక తన భర్తతో విడాకులు తీసుకుంది. ఇక అప్పటినుంచి ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
నిహారిక ఇప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతున్న సరైన విధంగా సక్సెస్ కావడం లేదు. పలు వెబ్ సిరీస్ లలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం నిర్మాతగా మారి ప్రొడక్షన్ హౌస్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా ప్రొడక్షన్ హౌస్ లో వెబ్ సిరీస్ లు మాత్రమే చేశారు. తాజాగా ఒక సినిమాకి కమిట్ అయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిహారిక ఘనంగా నిర్వహించారు. ఇక నిహారికకి ఇండస్ట్రీలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు.
నిఖిల్ విజయేంద్ర సింహ, వితికా షేరు, మహాతల్లి జాను, నిహారిక వీరంతా ఒక బ్యాచ్. ఎక్కడికి వెళ్ళినా పెద్ద రచ్చ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా వీరు చేసే రచ్చ మాములుగా ఉండదు. తాజాగా లైట్స్ ఆన్ ఆఫ్ అంటూ లైట్ ఆన్ అయినప్పుడు ఒక విధంగా, లైట్స్ ఆఫ్ అయినప్పుడు ఒక విధంగా డాన్స్ చేస్తూ రీల్స్ చేసిన వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోకి నిహారిక లైట్స్ ఆన్ ఆఫ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ వీడియో పై నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందించారు. కొందరు మీకంటూ సొంత రీల్స్ ఏమి చేయరా, మూడో క్లాస్ పిల్లాడు చేస్తున్న రీల్స్ చేస్తున్నారు అని కామెంట్ చేశారు. ఒక నెటిజన్ అయితే మీరంతా ఒక తొట్టి గ్యాంగ్ కదా రోజు మాకి టార్చర్ ఏంది అని వీడియో పై కామెంట్ చేశారు.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.