Niharika Konidela – Chaitanya : సినిమా సెలబ్రిటీల జీవితాలలో విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇదే కోవలోకి మెగా డాటర్ కొణిదెల నిహారిక చైతన్య కూడా వస్తున్నట్లు వెబ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. సరిగ్గా కరోనా సమయంలో 2020లో ఆగస్టు 13వ తారీఖున గుంటూరుకీ చెందిన జొన్నలగడ్డ చైతన్యతో… నిహారిక నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో బంధువులు సన్నిహితులు అతి తక్కువ మంది సమక్షంలో డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి వివాహం జరిగింది.
Niharika Konidela mind blowing twist in Chaitanya matter
అయితే పెళ్లయి రెండు సంవత్సరాల లోనే ఈ జంట మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు… ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుండి వస్తున్న ఈ వార్తల విషయంలో అటు మెగా కుటుంబం నుండి గాని ఇటు చైతన్య గాని ఎవరు స్పందించలేదు. అయితే కారణం చూస్తే సోషల్ మీడియాలో నిహారిక..భర్త జొన్నలగడ్డ చైతన్య ఇద్దరు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన భర్త చైతన్యతో దిగే ప్రతి ఫోటో సందర్భాలను నిహారిక సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసి ఆనందం పంచుకుంటుంది. అటు చైతన్య కూడా నిహారికతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఎంతో అన్యోన్యంగా సన్నిహితంగా
ఉండే ఈ జంట ఇటీవల..ఆపోజిట్ పర్సన్ తో దిగిన ఫోటోలను డిలీట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చైతన్య అయితే తన ఎకౌంటులో నిహారిక మొత్తం ఫోటోలు అన్నిటిని డిలీట్ చేసి ఒక్క కుక్క పక్కన ఆమె దిగిన ఫోటో ఒకటి మాత్రమే ఉంచటం జరిగింది. గోల్డెన్ ట్రైవర్ జాతికి చెందిన కుక్కపిల్లతో నిహారిక దిగిన ఫోటో. దీంతో విడాకుల వార్తలు వైరల్ అవ్వుతున్న క్రమంలో చైతన్య ఇంస్టాగ్రామ్ అకౌంట్లో కుక్కపిల్లతో నిహారిక దిగిన ఫోటో బట్టి ఇద్దరు విడిపోలేదని మెగా అభిమానులు మరోపక్క కవర్ చేసుకుంటున్నారు. నిజంగా విడాకులు తీసుకున్నే ఆలోచన చైతన్యకీ ఉంటే తాను ప్రేమగా పెంచుకునే కుక్క పక్కన నిహారిక ఫోటోలు ఉండనిచ్చేవాడు కాదని..
ఆ ఫోటో కూడా డిలీట్ చేసేవాడని చెపుతున్నారు. అయితే కుక్కతో నిహారిక దిగిన ఫోటో ఒకటి మాత్రమే ఉంచి మిగిలిన ఫోటోలు అన్నిటిని చైతన్య డిలీట్ చేయడం వెనకాల పెద్ద గొడవ జరిగిందన్న వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తుంది. మరి ఈ విషయంలో మెగా ఫ్యామిలీ స్పందిస్తే బాగుంటుందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీలో చాలా జంటలు విడిపోయాయి. పవన్ కళ్యాణ్ విషయంలో అదేవిధంగా చిరంజీవి రెండో కూతురు శ్రీజ విషయంలో పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. అయితే ఇప్పుడు నిహారిక పెళ్లి విషయం కూడా ఇబ్బందుల్లో పడిందా అనేది అందరికీ సందేహకరంగా మారింది.
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
This website uses cookies.