Niharika Konidela : మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలి.. పోసానిపై నిహారిక సంచలన కామెంట్స్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 29 September 2021, 3:00 pm

Niharika Konidela సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచు, చేసిన ఘాటు వ్యాఖ్యలు, ఏపీ ప్రభుత్వం, మంత్రుల మీద వాడిన పదజాలం ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ, రాజకీయ రంగం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే పోసానీ కృష్ణ మురళీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Niharika Konidela On Posani Krishna Murali

Niharika Konidela On Posani Krishna Murali

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ వైసీపీ కార్య‌క‌ర్త‌, టాలీవుడ్ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్‌తో నీకు పోలికేంటి అంటూ ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోశాడు. ఇక పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలపై పోసాని దారుణమైన కామెంట్లు చేశాడు..

Niharika Shoots For Web series At Midnight

Niharika Shoots For Web series At Midnight

పోసానిపై నిహారిక సంచలన కామెంట్స్ Niharika Konidela

తాజాగా ఈ ఇష్యూపై మెగా డాటర్ నిహారిక మరింత ఘాటుగా రియాక్ట్ అయింది. పోసాని కృష్ణ మురళిని వెంటనే మెంటల్‌ ఆస్పత్రిలో చేర్పించాలంటూ సంచలన కామెంట్స్ చేసింది. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా మెంటల్ కృష్ణ అంటూ నిహారిక చేసిన కామెంట్స్ చేసింది. జగన్‌ని పవన్ విమర్శించారనే పోసాని అలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడింది. పోసాని ఓ మానసిక రోగి అని, ఆయన్ను వెంటనే మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలని ఘాటుగా స్పందించింది.

Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event

Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp