Home » Entertainment » Niharika Konidela Says Thanks To Pawan Kalyan
Entertainment

Niharika Konidela : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన నిహారిక‌ కొణిదెల.. ట్రోల్స్ చేస్తున్న నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Published on: June 17, 2022, 12:00 pm
Advertisement

Niharika Konidela : టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయ‌ల‌లోను తెగ యాక్టివ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీలో పర్యటించనున్నారు. దీంతో ఆయన తన పర్యటన కోసం కొత్త కాన్వాయ్ సిద్ధం చేసుకున్నారు. ఎనిమిది కొత్త కార్లు కొనుగోలు చేశారు పవన్.ఈ కొత్త కార్ల కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. ఒక్కో కారు విలువ దాదాపుగా 19 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.జనసేన పార్టీ కోసం పవన్ ఈ కార్లను కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది.. అటు రాజకీయాలు..

Advertisement

ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్న పవర్ స్టార్ ఈ దసరా పండుగ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ప‌వన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా ఏపీలో కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం తమ వంతుగా సాయం చేసేందుకు మెగా ఫ్యామిలీ ముందుకు వచ్చింది. నాగబాబు కుటుంబ సభ్యులు, సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు, అలాగే పవన్ చెల్లి మాధవి..కౌలు రైతులని ఆదుకునే కార్యక్రమం కోసం ఆర్థిక సాయం అందించారు. నాగబాబు ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ 10 లక్షలు, నిహారిక 5 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Niharika Konidela says thanks to pawan kalyan

Advertisement

Niharika Konidela : నిహారిక విషెస్..

దీనితో పవన్ వారందరిని అభినందిస్తూ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి స్పందిస్తూ నిహారిక ట్వీట్ చేసింది. ప్రజల భవిష్యత్తు కోసం, వారిని అందుకునేందుకు నీవు చేస్తున్న గొప్ప పనిలో చిన్న భాగం అయినందుకు.. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ కళ్యాణ్ బాబాయ్. ప్రజలకు మెరుగైన బాట వేయాలంటే అది నీ ఒక్కడి వల్లే సాధ్యం అని నిహారిక ట్వీట్ చేసింది. . తాజాగా నిహారిక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.. ట్విట్టర్ వేదికగా నిహారిక పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపింది. నిహారిక గ‌త కొంత కాలంగా సినిమ‌ల‌కు దూరంగా ఉంటూ కేవ‌లం వెబ్ సిరీస్‌లకే ప‌రిమితం అయింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి