Home » Entertainment » Niharika Konidela Shares Maldives Pic
Entertainment

Niharika Konidela: మాల్దీవుల్లో బాగానే రచ్చ.. అండర్ వాటర్‌లో నిహారిక

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 30, 2021, 8:20 pm
Advertisement

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఈ మధ్య అయితే మరీ ముఖ్యంగా ఆచార్య ఆప్టేట్లపై నిహారిక వేసే పంచ్‌లు ఫుల్ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి తన ఆచార్య టీజర్ అప్డేట్‌పై వేసుకున్న మీమ్‌పై నిహారిక కౌంటర్ వేసింది. లీక్ చేయమంటావా? అని కొరటాలను చిరంజీవి బెదిరించడంపై నిహారిక సెటైర్ వేసింది. త్వరగా లీక్ చేసేయండి డాడీ అప్పటి వరకు ఎదురుచూడలేనని చెప్పేసింది.

Advertisement

Niharika Konidela shares Maldives pic

సమ్మర్ త్వరగా వస్తే బాగుండు : Niharika Konidela

ఇక టీజర్ రిలీజ్ చేశాక, విడుదలపై అప్డేట్ ఇచ్చాక మరో కౌంటర్ వేసింది. వేసవిలో సినిమాలో విడుదల కాబోతోందని ఆచార్య టీం ప్రకటించడంపైనా పంచ్ వేసింది. సమ్మర్ త్వరగా వస్తే బాగుండు.. అంత వరకు ఆగలేకపోతోన్నా అని చెప్పుకొచ్చింది. తాజాగా నిహారిక మరో పోస్ట్ చేసింది. అయితే మాల్దీవుల్లో నాడు ఎంజాయ్ చేసిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంది. నిహారిక తన భర్త చైతన్యతో కలిసి మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Advertisement

డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్న నిహారిక క్రిస్మస్ పార్టీని మెగా ఇంట్లోనే గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. ఆ తరువాత హనీమూన్ కోసం ఈ కొత్త జంట మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఎంజాయ్ చేసిన క్షణాలను కెమెరాలో బంధించేశారు. ఆ మధ్య షేర్ చేసిన ఫోటోలన్నీ కూడా బాగానే వైరల్అయ్యాయి. అయితే తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది. ఇందులో నిహారిక అండర్ వాటర్‌లో ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇందులో మరీ కురచ బట్టలేమీ ధరించకుండా మెగా ఫ్యామిలీ పరువుకాపాడేసింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి