Niharika Konidela : నా దగ్గర ఓ సీక్రెట్ ఉంది.. నిహారిక కొణిదెల క్రేజీ పిక్ వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Niharika Konidela : నా దగ్గర ఓ సీక్రెట్ ఉంది.. నిహారిక కొణిదెల క్రేజీ పిక్ వైరల్

 Authored By bkalyan | The Telugu News | Updated on :18 January 2021,7:55 pm

మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సోసల్ మీడియాలో నిహారిక చేసే పోస్ట్‌లు, చేసే ఫన్నీ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. పెళ్లయ్యాక నిహారిక షేర్ చేసే ఫోటోల్లో చాలా తేడా కనిపిస్తోంది. పెళ్లయ్యాక నిహారిక తన వస్త్రాధారణను మార్చేసింది. పొట్టి డ్రెస్సులో నిహారిక చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిహారిక చైతన్యలు సోషల్ మీడియాలో చేసే హంగామాకు అందరూ ఫిదా అవుతుంటారు.

Niharika Konidela Shares Her Marriage Pic

Niharika Konidela Shares Her Marriage Pic

నిహారిక కొణిదెల బర్త్ డే గిఫ్ట్

నిహారిక బర్త్ డే సందర్భంగా చైతన్య ఇచ్చిన గిఫ్ట్‌కు అందరూ ఫిదా అయ్యారు. బజ్ అనే పెట్‌ను బర్త్ డే గిఫ్ట్‌గా నిహారికకు చైతన్య ఇచ్చాడు. ఆ పెట్‌కు సపరేట్ ఇన్ స్టా అకౌంట్‌ను క్రియేట్ చేశారు. అలా నిహారిక చైతన్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ సందడి చేస్తున్నారు. నిహారిక పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నాగబాబు వాటిని తన యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేస్తూనే ఉంటాడు.

అయితే తాజాగా నిహారిక ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఉష్ అంటూ నోటి మీద వేలు వేసి ఏదో సీక్రెట్ చెబుతున్నట్టుగా తెలిపింది. నా దగ్గర ఓ సీక్రెట్ ఉంది.. కానీ అది అందరికీ చెబితే సీక్రెట్ ఎలా అవుతుంది.. ఆ సీక్రెట్ గురించి ఫోటో గ్రాఫర్‌కి మాత్రమే తెలుసు అంటూ ఫన్నీ కామెంట్ చేసింది. మొత్తానికి నిహారిక షేర్ చేసిన ఈ పెళ్లి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిహారిక తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌తో బిజీ కాబోతోంది. అనసూయతో కలిసి చేస్తోన్న ఆ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది