Niharika Konidela : విడాకులు తర్వాత దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నా... కానీ మా నాన్న చెప్పిన మాటతో... నిహారిక కొణిదల..!
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి మనందరికీ తెలిసిందే. మొదట పలు రకాల కార్యక్రమాలు మరియు టీవీ షోలలో కనిపించి ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టారు. ఇక హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ నిహారికకు అంతగా కలిసి రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పిన నిహారిక కొణిదల జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకుంది. అయితే కొన్నాళ్లపాటు చాలా సాఫిగా సాగిన వీరి వైవాహిక జీవితం తర్వాత విడాకులకు దారి తీసింది. ఇక చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో కూడా కనిపించకుండా కాస్త దూరంగా ఉన్న నిహారిక కొణిదల ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో కనిపిస్తూ వస్తుంది. అంతేకాక ఇటీవల తన అన్నయ్య వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి పెళ్లిలో నిహారిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాక ఇప్పుడు పలు రకాల సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ అమ్మడు చాలా బిజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోని తాజాగా ఓ మూవీ ప్రెస్ మీట్ కి వెళ్లిన నిహారిక విడాకుల తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యల గురించి మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన విడాకులు తర్వాత తాను చాలా మనస్థాపానికి గురైనట్లుగా తెలియజేశారు. అది చాలదు అన్నట్లు సోషల్ మీడియాలో నా గురించి తప్పుగా ప్రచారాలు జరగడం, నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా రావడంతో మరింత కుంగిపోయినట్లుగా తెలియజేశారు. ఇక ఆ సమయంలో నాకు నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారని మరి ముఖ్యంగా మా నాన్న నన్ను ఎంతగానో దగ్గరికి చేర్చుకొని చూసుకున్నారని ఈ సందర్భంగా నిహారిక చెప్పుకొచ్చారు. మా ఫ్యామిలీ నాకు ఎంతలా సపోర్ట్ చేయడం వలన అన్ని దాటుకొని ఇప్పుడు మళ్ళీ అందరిలోకి వచ్చానంటూ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నానంటూ తెలియజేశారు.
అయితే విడాకులు తీసుకొని తాను ఇంట్లో ఏడుస్తూ కూర్చున్న సమయంలో మా నాన్న నా దగ్గరకు వచ్చి తల్లి ఇది కాదు జీవితం అంటే… నువ్వు చూడాల్సింది చేయాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా నిహారిక చెప్పుకొచ్చారు. జీవితంలో కచ్చితంగా మనకు సపోర్ట్ గా నిలబడే భాగస్వామి ఉండాలని అలాంటి భాగస్వామి లేకపోతే మన కుటుంబ సభ్యులే ఆ బాధ్యత తీసుకుంటారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అదేవిధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి కూడా నిహారిక సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు వేరే బిజినెస్ లు ఏమి తెలియవని కేవలం సినిమాలు తీస్తూ దానిలో వచ్చిన డబ్బును రాజకీయాలలో పెడుతూ ఉంటారని తెలియజేసింది.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.