Niharika Konidela : తండ్రి మాట కూడా కాదు అని నిహారిక కొణిదెల స్ట్రాంగ్ నిర్ణయం !
Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక వివాహ జీవితం అస్తవ్యస్తం కావటం తెలిసిందే. 2020లో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో పెళ్లయిన నిహారిక రెండు సంవత్సరాలు పాటు పెళ్లి జీవితం అద్భుతంగా గడిచింది. పెళ్లికి ముందు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ అలరించడం జరిగింది. పెళ్లయిన తర్వాత ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతూ పలు సినిమాలను నిర్మించడం జరిగింది. ఈ క్రమంలో నటనకు దూరం కావడం జరిగింది. అయితే ఇటీవల గత కొద్ది నెలల నుండి నిహారిక విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో అన్న వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకలో కూడా నిహారిక ఒంటరిగా మాత్రమే కనిపించడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు పెళ్లి తర్వాత నటనకు దూరమైన నిహారిక… తాజాగా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడం జరిగిందట. మేటర్ లోకి వెళ్తే ఇకనుండి నటిగా సినిమా రంగంలో రాణించాలని ఫుల్ గా డిసైడ్ అయిందట. అయితే ఈ విషయంలో తండ్రి నాగబాబు పునరాలోచించుకోవాలని కోరినట్లు వద్దని వారించినట్లు అయినా గాని తండ్రి మాట కూడా కాదని.. సినిమా రంగంలో ఇక రాణించాలని స్ట్రాంగ్ గా నిహారిక డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకపక్క నిర్మాణ రంగంలో మరోపక్క నటిగా కూడా ప్రాజెక్టులు ఒప్పుకోవాలని కెరియర్ పరంగా ముందుకు వెళ్లాలని బలమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందంట. దీంతో మళ్లీ నటిగా మారి “డెడ్ పిక్సెల్స్” అనే వెబ్ సిరీస్ ఇటీవల చేయటం జరిగిందంట.
ఈ సీరీస్ పరవాలేదు.. అని అనిపించుకోవడంతో.. తాజాగా మరో యంగ్ హీరో సరసన నటించేందుకు నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాబోతున్నాయి అని టాక్. మ్యారేజ్ లైఫ్ అస్తవ్యస్తం కావడంతో సినిమా రంగంలో ఇంకా బిజీకావాలని నిహారిక స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు సెకండ్ ఇన్నింగ్స్ నటిగా మరియు నిర్మాతగా రాణించడానికి ఉత్సాహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.