Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాటర్
ప్రధానాంశాలు:
Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాటర్
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా కెరీర్ ప్రారంభించినా, ఇప్పుడు నిర్మాతగా తనదైన గుర్తింపు సంపాదించుకుంటోంది. తాజాగా ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఒక సీక్రెట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారికంగా ప్రకటించడం, నిహారిక ప్రొఫెషనల్ జర్నీలో మరో కీలక మలుపుగా మారింది. నాగబాబు కుమార్తెగా, షార్ట్ ఫిల్మ్స్‌తో యూత్‌లో ఫాలోయింగ్ తెచ్చుకున్న నిహారిక, “ఒక మనసు” సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాటర్
Niharika Konidela : నిహారిక ఏం చెప్పనుంది..
అయితే నటిగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో, తన సొంత బ్యానర్ “పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్” స్థాపించి నిర్మాతగా మారింది. “డెడ్ లైన్”, “కమిటీ కుర్రోళ్లు” వంటి వినూత్న వెబ్ సిరీస్‌లను నిర్మించిన నిహారిక, కంటెంట్‌కి ప్రాధాన్యతనిచ్చే నిర్మాతగా పేరు తెచ్చుకుంది. “కమిటీ కుర్రోళ్లు” సూపర్ హిట్ కావడంతో పాటు, ఆమెకు “బెస్ట్ ప్రొడ్యూసర్” అవార్డును కూడా అందించింది.
ప్రస్తుతం నిహారిక తన రెండో సినిమా “ప్రొడక్షన్ నెం.2” పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తుండగా, మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా నిహారిక తన స్నేహితుడు అంబటి భార్గవ్ తో కలిసి ఓ సీక్రెట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందే వెబ్ సిరీస్ కావొచ్చని టాక్. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక వివరాలు బయటకివస్తాయని తెలుస్తోంది. తెలుగు డిజిటల్ కంటెంట్‌కు గ్లోబల్ టచ్ ఇవ్వాలన్నదే ఈ ప్రయోగం వెనుక ఉద్దేశమని తెలుస్తుంది.