Home » Entertainment » Niharika Selfie With Chiranjeevi In Her Wedding Celebrations
Entertainment

Pic Of The day : చిరు నిహారిక సెల్ఫీ వైరల్

Authored By
Admin
The Telugu News | Updated on: December 7, 2020, 5:46 am
Advertisement

మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకలు గత ఐదారు రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. నిహారిక చైతన్యల పెళ్లి డిసెంబర్ 9న రాత్రి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ ప్యాలెస్‌లో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పెళ్లికి ముందు జరగాల్సిన కార్యక్రమాలు, సంబరాలన్నీ కూడా నాగబాబు ఇంట్లో మొదలయ్యాయి. ఐదారు రోజుల క్రితమే ఈ వేడుకలన్నీ మొదలయ్యాయి. మెగా అల్లు ఫ్యామిలీలంతా ఏకమై నిహారిక పెళ్లిలో రచ్చ చేస్తున్నారు.

Advertisement

నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో మెగా సిస్టర్స్, అల్లు బ్రదర్స్, మెగా గ్రాండ్ డాటర్స్ రచ్చ రచ్చ చేశారు. సుష్మిత, శ్రీజ, నిహారికలు కలిసి రచ్చ చేస్తుంటే.. నివృత్తి, నవిష్క, సంహిత కలిసి సందడి చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు బాబీ, అల్లు శిరీష్ ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇప్పటి వరకు ఈ ఈవెంట్లో యంగ్ స్టర్స్ మాత్రమే రచ్చ చేశారు. కానీ నేడు మాత్రం నిహారికను పెళ్లి కూతురుని చేసిన ఈవెంట్‌లో పెద్ద వాళ్లు పాల్గొన్నారు.

Niharika selfie with Chiranjeevi In Her Wedding Celebrations

Advertisement

నిహారిక తన అమ్మ (పద్మజ) నిశ్చితార్థానికి కట్టుకున్న చీరను అంటే 32 ఏళ్ల క్రితం నాటి చీరను కట్టుకుంది. పెళ్లి కూతురిని చేసిన ఈవెంట్‌లో చిరంజీవి కూడా విచ్చేశాడు. ఇక చిరంజీవితో నిహారిక దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. పిక్ ఆఫ్ ది డే అంటూ అభిమానులు సంబరపడుతున్నారు. ఆయన ప్రేమ.. సమయానికి, వయసుకు ఉన్న హద్దులను చెరిపివేస్తోంది.. ఆయన నవ్వు ఈ ఈవెంట్‌లోనైనా పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది.. అని చిరంజీవిపై నాగబాబు కామెంట్ చేశాడు.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి