Home » Andhra Pradesh » Niharika Shoots For Web Series At Midnight
andhra pradesh

Niharika : అర్ధరాత్రి కూడా వదలడం లేదా?.. నిహారిక బాగా అలిసిపోయినట్టుంది!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: February 21, 2021, 10:44 pm
Advertisement

Niharika : నిహారిక కొణిదెల పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటుందనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రూమర్లకు తగ్గట్టే ఈ మెగా ప్రిన్సెస్ వెండితెరకు దూరంగా ఉంది. కానీ ఓటీటీ ప్రపంచానికి మాత్రం దగ్గరానే ఉంది. నిహారికకు ఓటీటీ వేదికగా మంచి పేరు ఉంది. ఓటీటీ అనే పదం తెలియని రోజుల్లో నిహారిక అక్కడ వండర్లు క్రియేట్ చేసింది. తెలుగులో మొదటిసారిగా వెబ్ సిరీస్‌లను పరిచయం చేసింది కూడా నిహారికే.

Advertisement

అలాంటి నిహారిక పెళ్లి తరువాత ఓ వెబ్ సిరీస్‌ను ప్రారంభించింది. తన భర్త చైతన్య చేతుల మీదుగానే పూజా కార్యక్రమాలు చేయించింది. అలా ఈ కార్యక్రమంలో కొత్త జంటసందడి చేసింది. ఈ వెబ్ సిరీస్‌లో అనసూయ కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. అయితే ఈ మధ్యే ఈ ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. ఈ మేరకు సెట్‌లోకి అడుగుపెట్టిన నిహారికకు కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపించింది.

Niharika Shoots For Web series At Midnight

Advertisement

Niharika : నిహారిక బాగా అలిసిపోయినట్టుంది

చాలా గ్యాప్ తరువాత ఇలా సెట్‌లోకి రావడం, పని చేయడం ఎంతో అద్భుతంగా ఉందంటూ తన ఫీలింగ్ గురించి చెప్పింది.అయితే ఇప్పుడు మాత్రం నిహారికకు వాచిపోతున్నట్టుంది. డే అండ్ నైట్ అనే తేడా లేకుండా షూటింగ్‌లు చేస్తోందట. అర్దరాత్రి దాటాక కూడా షూటింగ్ చేయడంతో అసహనంగా ఫీలైనట్టు కొన్ని ఎమోజీలను పెట్టేసింది. నిద్ర వస్తోన్నట్టుగా చెబుతూ క్లాప్ కొడుతున్న ఎమోజీని కూడా షేర్ చేసింది.

ఇది కూడా చ‌దవండి ==> ఆచార్య విషయంలో హర్ట్ అయిన చిరంజీవి.. ఇక ఆయన వద్దంటే వద్దు..?

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి