Nikhil : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో సక్సెస్ ఫుల్‌గా 8 సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజా సీజన్‌లో విజేత ఎవరనేది తెలిసిపోయింది. 105 రోజుల పాటు సాగిన ఈ రియాల్టీ గేమ్ షో నేటితో ముగిసింది. కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8 విజేతగా నిలిచాడు. గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ 8 సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ విజేత నిఖిల్‌కు ట్రోఫీ అందించారు. అలాగే, రూ. 55 లక్షల ప్రైజ్‌మనీతో పాటు మారుతీ సుజుకీ డాజ్లింగ్ డిజైర్ కారును కూడా అందించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకూ బిగ్‌బాస్ సీజన్‌లలో బిగ్ ప్రైజ్ మనీగా హోస్ట్ నాగార్జున ప్రకటించారు.
బిగ్‌బాస్ 8 సీజన్‌లో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ షోలో పాల్గొన్నారు. ఫినాలే వీక్‌లో గౌతమ్, ప్రేరణ, నిఖిల్, అవినాష్, నబీల్ ఫైనలిస్ట్‌గా నిలిచారు. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిఖిల్ ఫైనల్ రేసులో విన్నర్‌గా నిలవగా, గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్ నిఖిల్ రూ.55 లక్షల ప్రైజ్‌మనీ, మారుతీ సుజూకీ కారును అందుకున్నాడు. అయితే తెలుగు నటుడు కాకపోవడంతో కన్నడ బ్యాచ్ అంటూ నిఖిల్ పైకి అవమానాలు మొదలయ్యాయి. యష్మి విషయంలో నిఖిల్ చివరికి తన క్యారెక్టర్ పై కూడా మచ్చ వేయించుకున్నాడు. ఆడవాళ్ళని వాడుకునే రకం అంటూ ఇతర హౌస్ మేట్స్ నిఖిల్ క్యారెక్టర్ ని తప్పు పట్టారు. అయినప్పటికీ నిఖిల్ సహనం కోల్పోలేదు. కోపం వచ్చినప్పటికీ నోరు జారే విధంగా ప్రవర్తించలేదు. అన్నింటికీ తట్టుకుని దమ్మున్నోడిగా నిలబడ్డాడు.
బిగ్ బాస్ చరిత్రలోనే నిఖిల్ అత్యథిక ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు బిగ్ బాస్ విన్నర్ కి 50 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నారు. కానీ ఈ సీజన్ కి ప్రైజ్ మనీ 55 లక్షలకి చేరింది. ప్రైజ్ మనీ పక్కన పెడితే నిఖిల్ రెమ్యునరేషన్ కూడా తక్కువేం కాదు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో వారానికి 2.25 లక్షలు రెమ్యునేషన్ తీసుకున్నాడు. మొత్తం 15 వారాలకు నిఖిల్ లో పారితోషికం రూపంలో 33 లక్షల వరకు ముట్టింది. ప్రైజ్ మనీ 55 లక్షలు, రెమ్యునరేషన్ 33 లక్షలు కలిపి మొత్తం 88 లక్షల వరకు నిఖిల్ బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా సంపాదించాడు. దీనితో పాటు మారుతీ సుజుకి డిజైర్ కారు కూడా నిఖిల్ కి దక్కుతుంది. మొత్తంగా చూసుకుంటే నిఖిల్ సంపాదన దాదాపు కోటి రూపాయలు అనుకోవచ్చు. ఏదేమైన ఈ సీజన్ అంత జోష్ అందించలేదని చెప్పాలి.
Ram Charan : బాలీవుడ్ లో మొన్నటిదాకా టాప్ లీగ్ లో ఉన్న కియరా అద్వాని అనుకోకుండా వెనకపడిపోయింది. అమ్మడికి…
Mahesh Rajamouli Movie : సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ సినిమా విషయంలో…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఈమధ్య ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఆయన పుష్ప 2…
Good News : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరాల జల్లు ప్రకటిస్తుంది. తాజాగా తెలంగాణలో భూమిలేని నిరుపేదలకు 12 వేల…
Ys Jagan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. దీంతో వచ్చే ఎన్నికలలో మంచి…
Virat kohli : టీమిండియా తీరు మారడం లేదు.రెండో టెస్ట్‌లో దారుణంగా ఓడిన ఇండియా గబ్బా వేదికగా జరగుతున్న మూడో…
Allu arjun Nagababu : గత కొద్ది రోజులుగా బన్నీ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారుతుంది. పుష్ప సినిమా విడుదల…
Justice : థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో అల్లు అర్జున్‌ని…
This website uses cookies.